AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిపెండెన్స్ స్పీచ్‌ల్లో ప్రధానులు ప్రస్తావించేదేమిటి..!

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి గల్లీలోనూ మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ప్రతి స్వాతంత్య దినోత్సవం రోజు భారత ప్రధాని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జెండా వందనం అనంతరం ప్రధానులు జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక ఈ ప్రసంగంలో సాధారణంగా తమ ప్రభుత్వం అప్పటివరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయాల్సిన అభివృద్ధి పథకాలు, కొత్త నినాదాలు తదితరాలపై ప్రధానమంత్రులు […]

ఇండిపెండెన్స్ స్పీచ్‌ల్లో ప్రధానులు ప్రస్తావించేదేమిటి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 2:57 PM

Share

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి గల్లీలోనూ మువ్వెన్నెల జెండాను ఎగురవేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా ప్రతి స్వాతంత్య దినోత్సవం రోజు భారత ప్రధాని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జెండా వందనం అనంతరం ప్రధానులు జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక ఈ ప్రసంగంలో సాధారణంగా తమ ప్రభుత్వం అప్పటివరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయాల్సిన అభివృద్ధి పథకాలు, కొత్త నినాదాలు తదితరాలపై ప్రధానమంత్రులు ప్రసంగిస్తారు. ప్రధాని పదవుల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీరు.. తమ ప్రభుత్వ పథకాలు, వాటి అమల్లో తాము సాధించిన విజయాలను ప్రస్తావించారు.

కాగా 1991 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రులలో మోదీ మొదటి స్థానంలో ఉన్నారు. వీరి ప్రసంగాల్లో సగటున 8వేల నుంచి 10వేల పదాలు జాలువారాయి. మోదీ తరువాత స్థానంలో పీవీ నరసింహారావు(సగటున 5,500 పదాలు), మన్మోహన్ సింగ్(సగటున 3,600 పదాలు), వాజ్‌పేయి(సగటున 3,300పదాలు) ఉన్నారు. ఇక ఈ ప్రసంగాలలో వారు ముఖ్యంగా గ్రామీణ భారతం, టెర్రరిజం, దారిద్య్రం, కులం, మతం, మహిళలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఇండస్ట్రీస్, ఉద్యోగ అవకాశాలు, ఎకానమీ, అభివృద్ధి తదితర విషయాలపై మాట్లాడారు.

Follow Us