గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో […]

గంటన్నర సేపు ప్రసంగం.. అయినా పాక్ ఊసేదీ..?
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2019 | 3:43 PM

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. మొత్తం 92నిమిషాల పాటు మోదీ ప్రసంగం సాగగా.. పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు ప్రధాని. ముఖ్యంగా దేశంలో ఉన్న నీటి సమస్య, పేదరికం, జనాభా పెరుగుదల, ఉగ్రవాదం అంశాలపై మాట్లాడిన మోదీ.. వాటి పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోవడం విశేషం.

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఇటీవల మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇన్ని రోజులు కశ్మీర్ అడ్డాగా పలు విధ్వంసాలకు పాల్పడిన ఆ దేశ ఉగ్రవాదుల ఆటలకు ఈ ఆర్టికల్ రద్దు చెంపపెట్టు పెట్టినట్లైంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై సమయం చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ వస్తున్నారు పాక్ అధికారులు. ఇక పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం మాట్లాడిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం.. తన ప్రసంగంలో పలుమార్లు కశ్మీర్ సమస్య గురించే ప్రస్తావించాడు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల భవిష్యత్‌లో పర్యవసానాలు తప్పవంటూ హెచ్చరించాడు. అయినా వీటన్నింటిపైన ఏ మాత్రం మోదీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం విడ్డూరం. పదే పదే పాకిస్తాన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ.. మోదీ మాత్రం మౌనం వహించడంలోని ఆంతర్యం అంతుపట్టడం లేదన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు