మోదీ స్పీచ్ లో మిస్ అయిన అంశాలు.. ఏమిటవి ?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీ కొన్ని ముఖ్యమైన అంశాలను విస్మరించారని ఓ ఇంగ్లీష్ మీడియాకు సంబంధించిన వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకీ ఏమిటవి ? ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దును చరిత్రాత్మకమైనవిగా ఆయన అభివర్ణించారు. సర్దార్ పటేల్ కన్న కలలను నిజం చేయడంలో ఇది ముఖ్యమైన చర్య అని పేర్కొన్నారు. ఈ అధికరణం అంత ముఖ్యమైనదయితే దీన్ని ఎందుకు శాశ్వతం చేయలేదని ప్రశ్నించారు. కానీ ఈ ఆర్టికల్ కి […]

మోదీ స్పీచ్ లో మిస్ అయిన అంశాలు.. ఏమిటవి ?
Follow us

|

Updated on: Aug 15, 2019 | 4:58 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీ కొన్ని ముఖ్యమైన అంశాలను విస్మరించారని ఓ ఇంగ్లీష్ మీడియాకు సంబంధించిన వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకీ ఏమిటవి ? ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దును చరిత్రాత్మకమైనవిగా ఆయన అభివర్ణించారు. సర్దార్ పటేల్ కన్న కలలను నిజం చేయడంలో ఇది ముఖ్యమైన చర్య అని పేర్కొన్నారు. ఈ అధికరణం అంత ముఖ్యమైనదయితే దీన్ని ఎందుకు శాశ్వతం చేయలేదని ప్రశ్నించారు. కానీ ఈ ఆర్టికల్ కి శాశ్వత స్థాయి ఉందని సుప్రీంకోర్టు 2018 లో ఇఛ్చిన తీర్పులో స్పష్టం చేసింది. దీనికి శాశ్వత ప్రతిపత్తి ఉందని నిర్ద్వంద్యంగా పేర్కొంది. ఆ విషయాన్ని మోదీ మరచినట్టున్నారు. అటు- కాశ్మీర్ లో సుమారు 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పరిస్థితి ఇంకా దాదాపు ఉద్రిక్తంగానే ఉంది.

ఇక ట్రిపుల్ తలాక్ బిల్లును తెఛ్చి తమ ప్రభుత్వం ‘ విజయం ‘ సాధించిందని, దీనివల్ల ముస్లిం మహిళలకు ఎంతో భద్రత కలుగుతుందని మోడీ అన్నారు. తమ సర్కార్ అధికారంలోకి వఛ్చిన 10 వారాల్లోగా పాత బడిన, కాలం చెల్లిన 60 చట్టాలను రద్దు చేసిందని మోదీ చెప్పారు. అయితే ముస్లిం పురుషులను నేరస్థులుగా ముద్ర వేసే ఈ బిల్లు పట్ల విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ప్రభుత్వాన్ని విమర్శించేవారి హక్కులను ఇది ఉల్లంఘించేదిగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆర్టీఐ సవరణ బిల్లు కూడా ఈ కోవలోనిదే. దీన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

పిల్లలు.. పిల్లలపై లైంగిక నేరాలను అదుపు చేసేందుకు తమ ప్రభుత్వం పోక్సో చట్ట సవరణ బిల్లును తెచ్చిందని మోడీ పేర్కొన్నారు. కానీ కాశ్మీర్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వెళ్లిన నిజ నిర్ధారణ బృందంలో ఒకరైన మహిళా సామాజికవేత్త కవితా కృష్ణన్.. ఆ రాష్ట్రంలో పిల్లలను, యువకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వివరించారు. అస్సాంలో ఎన్ ఆర్ సీ అమలవుతున్న నేపథ్యంలో అనేకమంది పిల్లల తలిదండ్రులు నిర్బంధ శిబిరాల్లో మగ్గుతూనే ఉన్నారు. వాతావరణ మార్పులు.. వాతావరణ పరిరక్షణ గురించి మోదీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కాలుష్య నివారణ చర్యల ఊసే లేదు. ఎకానమీ.. దేశ ఆర్ధిక పరిస్థితి బలంగా ఉందని మోదీ చెప్పుకున్నారు. కానీ దేశంలో ఆటో ఇండస్ట్రీ పరిస్థితి ఘోరంగా ఉంది. నాలుగు నెలల్లోనే సుమారు మూడున్నర లక్షలమంది ఉపాధి కోల్పోయారు. జీడీపీ వృద్ది రేటు 7 శాతం నుంచి 6. 9 శాతానికి తగ్గిపోయిందని ఆర్ధిక నిపుణులు గుర్తు చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఇప్పటికీ యువతను పీడిస్తోంది. ఇలా మోదీ కొన్ని ముఖ్యమైన అంశాల గురించిన ఊసే లేకుండా.. తన ప్రభుత్వ గొప్పలు చెప్పుకున్నారని ఈ సైట్ విశ్లేషించింది.