AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసమాన ధైర్యశాలి.. అభినందన్‌కు వీరచక్ర

న్యూఢిల్లీ: పాక్ సైనికుల చేతినుంచి చెక్కు చెదరని ధైర్యసాహసాల చూపిన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు యుద్ద సమయంలో అందించే దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన వీర్‌చక్ర వరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో మిగ్- 21 బైసన్ విమానాన్ని నడుపుతున్న అభినందన్ పాక్‌కు చెందిన ఎఫ్- 16 విమానాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఆయన ఉన్న విమానం సైతం కూలిపోయింది. ఆ సమయంలో […]

అసమాన ధైర్యశాలి.. అభినందన్‌కు వీరచక్ర
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 6:13 PM

Share

న్యూఢిల్లీ: పాక్ సైనికుల చేతినుంచి చెక్కు చెదరని ధైర్యసాహసాల చూపిన ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు యుద్ద సమయంలో అందించే దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన వీర్‌చక్ర వరించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో మిగ్- 21 బైసన్ విమానాన్ని నడుపుతున్న అభినందన్ పాక్‌కు చెందిన ఎఫ్- 16 విమానాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఆయన ఉన్న విమానం సైతం కూలిపోయింది. ఆ సమయంలో ఆయన పాకిస్తాన్‌ సరిహద్దు గ్రామంలోకి దూకాల్సి వచ్చింది. దీంతో పాక్ సైన్యానికి ఆయన చిక్కారు. శతృవు చేతికి చిక్కినా ఆయన ఎక్కడా తన ధైర్యాన్ని కోల్పోకుండా.. పాక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నిర్భయంగా చెప్పిన సమాధానాలు ఆయన గుండెల్లో ఉన్న ధైర్యానికి ప్రతీకగా నిలిచాయి. ఆయన తిరిగి భారత్‌కు క్షేమంగా చేరుకోవాలని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూశారు. మూడు రోజుల తర్వాత ఆయనను భారత్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో అసమాన ధైర్యాన్ని చూపి ఇండియా సత్తాను పాక్‌కు రుచిచూపించి మీసం మెలితిప్పిన అభినందన్ వర్ధమాన్‌కు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పతకాన్ని అందజేసింది.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో పాల్గొన్న ఐదుగురు పైలట్లకు కూడా మిలిటరీ అవార్డులు లభించాయి.

Follow Us
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
బుమ్రాకు ఏమైంది? ముంబై ఒప్పుకున్న ఆ కఠిన నిజం ఏంటి ?
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
తెలియక ఆ నది ఒడ్డుకు వెళ్లారంటే ఖతమే! అమాంతం దూకేసే అనకొండలుంటాయ్
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ట్రైన్‌లో మీ సీట్లో వేరే వ్యక్తి కూర్చున్నాడా..? ఈ నెంబర్‌కు..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
ఓవర్ యాక్షన్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ..
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
గతంలో నా కింద పని చేశాడు..పెద్ద డైరెక్టర్ అయ్యాక కలవడానికి వెళ్తే
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
నది మధ్యలో భారీ అనకొండతో ముద్దులాటలు..!
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది
గుజరాత్ మ్యాచ్ ముందు కోచ్ కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది
కొవ్వును కోసి పడేస్తాయ్.. ఈ గింజల సీక్రెట్ తెలిస్తే వదలరు
కొవ్వును కోసి పడేస్తాయ్.. ఈ గింజల సీక్రెట్ తెలిస్తే వదలరు
హార్దిక్ బ్లండర్..! బౌలింగ్ కాదు.. ముంబై ఓటమికి అసలు కారణం ఇదే..
హార్దిక్ బ్లండర్..! బౌలింగ్ కాదు.. ముంబై ఓటమికి అసలు కారణం ఇదే..