12th Fail: శుభవార్త చెప్పిన 12th ఫెయిల్‌ మూవీ హీరో.. పండంటి మగ బిడ్డ పుట్టాడంటూ విక్రాంత్ ఎమోషనల్‌

12th ఫెయిల్‌ సినిమా హీరో విక్రాంత్‌ మాస్సే శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందానన్న గుడ్‌ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 07) తన భార్య షీతల్‌ ఠాకూర్‌ పండంటి మగబిడ్డను ప్రసవించినట్లు విక్రాంత్‌ తెలిపాడు

12th Fail: శుభవార్త చెప్పిన 12th ఫెయిల్‌ మూవీ హీరో.. పండంటి మగ బిడ్డ పుట్టాడంటూ విక్రాంత్ ఎమోషనల్‌
Vikrant Massey Family
Follow us
Basha Shek

|

Updated on: Feb 08, 2024 | 11:18 AM

12th ఫెయిల్‌ సినిమా హీరో విక్రాంత్‌ మాస్సే శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందానన్న గుడ్‌ న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 07) తన భార్య షీతల్‌ ఠాకూర్‌ పండంటి మగబిడ్డను ప్రసవించినట్లు విక్రాంత్‌ తెలిపాడు. ‘ఈ రోజు (ఫిబ్రవరి 7వ తేదీ 2024) మేము ఒక్కటయ్యాం. మా జీవితాల్లో మరో కొత్త వ్యక్తి వచ్చారు. మాకు కుమారుడు పుట్టాడని చెప్పేందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఎనలేని ఆనందం, ప్రేమతో ఉప్పోంగిపొతున్నాం’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు విక్రాంత్‌. ప్రస్తుతం అతని పోస్ట్‌ సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విక్రాంత్-షీతల్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 12th ఫెయిల్‌ హీరోయిన్‌ మేధా శంకర్‌ కూడా విక్రాంత్‌ పోస్ట్‌ కు స్పందించింది. కంగ్రాట్స్‌ అంటూ విషెస్‌ చెప్పింది.

విక్రాంత్‌ సతీమని షీతల్‌ కూడా పలు సినిమాలు, సిరీస్‌లు, సీరియల్స్‌ లో నటించింది. విక్రాంత్‌ తో కలిసి బ్రోకెన్‌ బుట్‌ బ్యూటీఫుల్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో యాక్ట్‌ చేసింది. ఈ సిరీస్‌ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితలో 2022లో పెళ్లిపీటలెక్కారు. ఆ మరుసటి ఏడాదే త్వరలో అమ్మానాన్నాలం కాబోతున్నామోచ్‌ అంటూ తాను గర్భం ధరించిన విషయాన్ని బయటపెట్టింది షీతల్‌. ఇప్పుడు తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. ఇక గతంలో పలు సినిమాలు, సిరిస్ లు, సీరియల్స్‌ లో నటించాడు విక్రాంత్‌ మాసే. అయితే 12th ఫెయిల్‌ సినిమా విక్రాంత్‌ క్రేజ్‌ ను అమాంతం పెంచేసింది. ఇందులో అతని అభినయం విమర్శకుల ప్రశంసలు పొందింది.ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారం (క్రిటిక్స్‌ విభాగంలో) అందుకున్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విక్రాంత్ పేరు మార్మోగిపోతోంది. ఇటీవలే ఓటీటీలో రిలీజైన 12th ఫెయిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.

ఇవి కూడా చదవండి

మా జీవితంలో మరొక వ్యక్తి వచ్చాడు..

భార్య షీతల్ తో హీరో విక్రాంత్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్