Balagam Venu: గ్రేట్‌ వేణు.! స్టేట్ ఛాంపియన్ అంటే మామూలు విషయం కాదు.!

Balagam Venu: గ్రేట్‌ వేణు.! స్టేట్ ఛాంపియన్ అంటే మామూలు విషయం కాదు.!

Anil kumar poka

|

Updated on: Feb 08, 2024 | 12:54 PM

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు. పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం తర్వాత వేణు పేరు మారుమ్రోగింది.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు. పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. బలగం తర్వాత వేణు పేరు మారుమ్రోగింది. బలగం సినిమా తర్వాత వేణు ఎవరితో సినిమా చేస్తాడంటూ ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు నేచురల్ స్టార్ నానితో సినిమా చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాకు ఎల్లమ్మ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట. ఈ సినిమా గురించి కాస్తా పక్కకు పెడితే.. వేణు కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామెడీ టైమింగ్ , డైరెక్షన్ తో పాటు మరో టాలెంట్ కూడా ఉందట ఈయనలో..!

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు తన గురించి ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అని.. అందులో రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ షిప్ గెలిచానని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు వేణు. అంతేకాదు చుట్టూ ఉన్నవారిలో తాను స్పెషల్ గా ఉండాలి.. అందరూ తనని గుర్తించాలనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా అన్నారు. అయితే వేణు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఛాంపియన్ అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రేట్! వేణులో కూడా.. ఈ ట్యాలెంట్‌ కూడా ఉందనే మాట నెట్టింట కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..