Farmers Call: బెంగాల్‌లో బీజేపీని ఓడించండి.. సంయుక్త కిసాన్ మోర్చ తాజా పిలుపు

Farmers JAC called for BJP defeat in Bengal: దేశ రాజధాని శివార్లే వేదికగా గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న రైతు సంఘాల సంయుక్త ఆందోళన సెగ బీజేపీ బెంగాల్‌లో తగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భీష్మించుకుని కూర్చున్న సంయుక్త కిసాన్ మోర్చా.. మోదీ ప్రభుత్వం ఎంతకీ దిగి రాకపోవడంతో తమ సత్తా ఏంటో బీజేపీ తెలిసేలా చేయాలని చూస్తోంది. ఈ దిశగా శుక్రవారం (మార్చి 12న) సుదీర్ఘ చర్చలు […]

Farmers Call: బెంగాల్‌లో బీజేపీని ఓడించండి.. సంయుక్త కిసాన్ మోర్చ తాజా పిలుపు
18
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 12, 2021 | 7:07 PM

Farmers JAC called for BJP defeat in Bengal: దేశ రాజధాని శివార్లే వేదికగా గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న రైతు సంఘాల సంయుక్త ఆందోళన సెగ బీజేపీ బెంగాల్‌లో తగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని భీష్మించుకుని కూర్చున్న సంయుక్త కిసాన్ మోర్చా.. మోదీ ప్రభుత్వం ఎంతకీ దిగి రాకపోవడంతో తమ సత్తా ఏంటో బీజేపీ తెలిసేలా చేయాలని చూస్తోంది. ఈ దిశగా శుక్రవారం (మార్చి 12న) సుదీర్ఘ చర్చలు జరిపిన సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధులు.. బీజేపీని ఒడించాలంటూ బెంగాల్ ఓటర్లకు పిలుపునిస్తూ తీర్మానం చేశారు. రైతుల వ్యధ ఏంటో బీజేపీకి తెలియాలంటే బెంగాల్ బీజేపీకి బుద్ది చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధులు బెంగాల్ ప్రజలను కోరారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగంలో వేళ్ళూనుకు పోయిన దళారీ వ్యవస్థను, మండీ కమిషన్ సిస్టమ్‌ను పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ఢిల్లీని ముట్టడించేందుకు వచ్చిన రైతులను దేశ రాజధాని శివార్లలో నిలిపి వేయడంతో వారంతా అక్కడే మకాం వేసి ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మొన్నటి రిపబ్లిక్ డే (జనవరి 26) నాడు ఏకంగా ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించారు. జాతీయ పతాకానికి అవమానం చేస్తూ ఖలిస్తాన్ జెండాలని ఎర్రకోటపై ఎగురవేశారు. అయితే ఈరకమైన చర్యలకు పాల్పడింది రైతు సంఘాలు కాదని, ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతునిస్తున్నవారే ఇలా ప్రవర్తించారని సంయుక్త కిసన్ మోర్చ ప్రకటించింది.

ఇదిలా వుండగా.. ఉద్యమించిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం పలు మార్లు చర్చలు జరిపింది. రైతాంగ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొన్ని అంశాలను సవరించేందుకు కేంద్రం రెడీ అన్నది కానీ.. సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధులు మాత్రం మూడు వ్యవసాయ చట్టాలను పూర్తి రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అందుకోసం అవసరమైతే సుదీర్ఘ కాలంపాటు ఉద్యమం కొనసాగిస్తామంటున్నారు. అంతిమ డెడ్‌లైన్ అక్టోబర్ రెండు అని ఇటీవల ప్రకటించారు. అదే క్రమంలో మార్చి 26వ తేదీన దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే దేశంలోని అయిదు అసెంబ్లీలకు ఎన్నికల నగారా మోగింది. వీటిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార టీఎంసీ పార్టీతో బీజేపీ అక్కడ హోరాహోరీ తలపడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత బెంగాల్‌లో బీజేపీ ప్రబలమైన శక్తిగా ఎదిగింది. ఇటీవల కాలంలో పలువురు అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కమలనాథుల్లో గెలుపు మీద భరోసా పెరిగింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ బెంగాల్ ప్రజలకు తాజాగా పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలపై పట్టుదలగా వున్న బీజేపీకి బెంగాల్ ప్రజలు బుద్ది చెప్పాలన్నది సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధుల పిలుపు సారాంశం.

ALSO READ: అమెరికా నోవావాక్స్ వ్యాక్సిన్‌పై మరో గుడ్ న్యూస్

ALSO READ: ఈసారి కరోనా మరింత డేంజరస్! వీర్యకణాలపై కరోనా ప్రభావం?

ALSO READ: సరిహద్దులో తోకముడిచిన డ్రాగన్.. కొత్త వివాదాలకు డ్రాగన్ యత్నం..

ALSO READ: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్

ALSO READ: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్