West Bengal election 2021: బెంగాల్‌ దంగల్.. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఎవరెవరు ఉన్నారంటే..?

Congress releases campaigners list: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో పోరు హోరాహోరిగా మారింది. ఇప్పటికే బీజేపీ,..

West Bengal election 2021: బెంగాల్‌ దంగల్.. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఎవరెవరు ఉన్నారంటే..?
Congress Releases Campaigners List
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 12, 2021 | 6:57 PM

Congress releases campaigners list: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో పోరు హోరాహోరిగా మారింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మాటల తూటాలతో.. ప్రత్యేక్ష దాడులతో దూసుకుపోతున్నాయి. ఈ నెల 27న తొలిదశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా శుక్రవారం 30 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అధిష్టానంపై ఇటీవల గళమెత్తిన నేతలకు చోటు కల్పించకపోవడం గమనార్హం. ఈ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాందీ ఉన్నారు.

వీరితో పాటు ఈ జాబితాలో రాజస్తాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్, మల్లిఖార్జున్‌ ఖర్గే, పంజాబ్ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బాగేల్, అధిర్ రంజన్ చౌదరీ, రాజస్తాన్ మాజీ సీఎం సచిన్‌ పైలట్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, అభిజిత్‌ ముఖర్జీ, మహ్మద్‌ అజారుద్దీన్‌, అధీర్‌ రంజన్‌ చౌధరి, కమల్‌ నాథ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆర్పీఎన్‌ సింగ్‌, సుర్జేవాలా, జితిన్‌ ప్రసాద్, దీపా దాస్‌మున్షీ, దీపేంద్ర హుడా, అఖిలేష్‌ సింగ్‌, పవన్‌ ఖేరా, బీపీ సింగ్‌ తదితరుల పేర్లున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఎన్నికల సంఘానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అందించారు.

ఇదిలాఉంటే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, టీఎంసీ మధ్య పోటాపోటీ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ కూడా వామపక్షాలతో జతకట్టి సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కాలికి గాయమైనప్పటికీ… ఆమె కూడా ప్రచారం చేస్తానని వీడియో విడుదల చేశారు.

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు మార్చి 27న.. చివరి విడుత ఏప్రిల్‌ 29న జరుగనున్నాయి. పోలింగ్‌ తేదీలు.. తొలి విడత: మార్చి 27 రెండో విడత: ఏప్రిల్‌ 1 మూడో విడత: ఏప్రిల్‌ 6 నాలుగో విడత: ఏప్రిల్‌ 10 ఐదో విడత: ఏప్రిల్‌ 17 ఆరో విడత: ఏప్రిల్ 22 ఏడో విడత: ఏప్రిల్ 26 ఎనిమిదో విడత: ఏప్రిల్ 29

Also Read:

CredR: బంపర్ ఆఫర్.. 25 వేలకే అదిరిపోయే బైక్‌లు.. స్కూటీలు.. ఎక్కడనుకుంటున్నారు..