Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు మూగబోనున్న మైకులు.. చివరి రోజు కూడా ఎన్నికల సిత్రాలు.. విచిత్రాలు..

తమిళనాడులో ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. ప్రచారం ఆఖరి రోజు కూడా ద్రవిడ రాజ్యంలో చిత్ర విచిత్ర ఘటనలు జరిగాయి. స్టాలిన్‌ సీఎం కావాలని డీఎంకే పార్టీ కార్యకర్తలు బొటనవేలిని కోసుకోవడం సంచలనం రేపింది.

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు మూగబోనున్న మైకులు.. చివరి రోజు కూడా ఎన్నికల సిత్రాలు.. విచిత్రాలు..
Tamil Nadu Election 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2021 | 9:10 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది..? ఉత్కంఠభరితంగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం 234 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌కు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. గెలుపుపై ధీమాతో ఉన్నారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌. అన్నాడీఎంకే బీజేపీ అండతో ఎన్ని కుట్రలు చేసినా తమదే గెలుపున్నారు.

ప్రచారం చివరిరోజు  తాను పోటీ చేస్తున్న కొలత్తూరులో పాదయాత్ర చేశారు స్టాలిన్‌. ఆయనతో సెల్ఫీలు దిగడానికి యువత, చిన్నారులు పోటీ పడ్డారు. అయితే, ప్రచారం చివరిరోజు కూడా తమిళనాడులో చిత్ర విచిత్ర ఘటలను జరిగాయి. స్టాలిన్‌ సీఎం కావాలని డీఎంకే కార్యకర్త చేతి బొటనవేలిని కోసుకోవడం సంచలనం రేపింది.

విరుదునగర్ జిల్లాలో ఒళ్ళు జలదరించే విధంగా మొక్కు చెల్లించాడు డీఎంకే కార్యకర్త. డీఎంకే నేత స్టాలిన్ సీఎం అవ్వాలని చేతి వేళ్ళు నరికేసుకున్నాడు గురువయ్య. సాథుర్‌లోని మారియమ్మ ఆలయంలో స్టాలిన్ గెలుపొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన గురువయ్య… ఈ పిచ్చి పని చేశాడు. అమ్మవారికి తన చేతి వేళ్ళు నరికి కానుక ఇచ్చిన గురువయ్య తన సంకల్పం నెరవేతుందని అంటున్నాడు.

కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీ తరపున నటి సుహాసినితో పాటు ఆయన కూతురు అక్షర కూడా చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. టార్చ్‌లైట్‌ గుర్తును చూపిస్తూ కమల్‌ పార్టీని గెలిపించాలని డాన్స్‌ చేశారు. చెన్నైతో పాటు కోయంబత్తూరులో కూడా వీళ్లిద్దరు ప్రచారం చేశారు. అక్షరతో పాటు సుహాసిని కూడా అదిరేటి స్టెప్పులు వేశారు. తన బాబాయ్‌ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సుహాసిని.

మరోవైపు సీఎం పళనిస్వామి సేలంలో ప్రచారం చేశారు. అన్నాడీఎంకే విజయం ఖాయమన్నారు పళని. బోడినాయకర్‌ నియోజకవర్గంలో ప్రచారం చేశారు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం. మహిళలను అగౌరవపర్చిన డీఎంకేకు ఓటర్లు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.

తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందన్నారు బీజేపీ అధ్యక్షుడు నడ్డా. చెన్నైలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన చివరిరోజు ప్రచారం చేశారు.

ఇవి కూడా చదవండి: Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది ?

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే