AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

మీకు ఓ సంగతి తెలుసా.. మన దేశంలో ఉపయోగించే సీలింగ్ ఫ్యాన్‌కు మూడే రెక్కలే ఎందుకుంటాయి..? మూడు రేక్కలుంటే వచ్చే లాాభం ఏంటి..? ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!
Fan
Sanjay Kasula
|

Updated on: Apr 04, 2021 | 5:20 PM

Share

వేసవి కాలం వచ్చేసింది. ముదురుతున్న ఎండలు చమటలు పట్టిస్తున్నాయి. కూలర్లు, ఎసీలు లేకుంటే నిద్ర పట్టని పరిస్థితి నెకొంది. ప్రజలు వేసవి వేడిని వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే అంశం వాతావణరం గురించి కాదు.. మనకు అన్ని సమయాల్లో మన ఇంట్లో రివ్వున తిరిగే సీలింగ్ ఫ్యాన్ గురించి.. మన ఇంట్లోని ఫ్యాన్‌కు ఎందుకు మూడు రోక్కలే ఉంటాయి..! మూడు రెక్కలుంటే ఉపయోగం ఏంటి..! భారత్‌లో మాత్రమే ఇలా ఉంటాయా..? ఇతర దేశాల్లోనూ ఇలా ఉంటాయా ఓ సారి చెప్పుకుందాం…

మీరు చాలా సంతోషంగా కూర్చున్నప్పుడు హాయిగా పై నుంచి గాలి వీస్తుంతుంటే వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. బయట నుంచి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ కావాలంటే.. ఫ్యాన్ వేసుకుని ఆకాశం వైపు చూస్తూ.. చిన్న కునుకు తీస్తే వచ్చే ఆనందమే వేరు…

అయితే ఎప్పుడైన మీకు ఈ ఆలోచన వచ్చిందా…! గది పైకప్పు నుండి వేలాడుతున్న సీలింగ్ ఫ్యాన్ గరిష్టంగా మూడు బ్లేడ్లు ఎందుకు కలిగి ఉంది.. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మూడు బ్లేడెడ్ సీలింగ్ ఫ్యాన్ వెనుక గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం…

ఐదు బ్లేడ్ ఫ్యాన్..

భారతదేశంలో చాలా వరకు మూడు-బ్లేడ్ల సీలింగ్ ఫ్యాన్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఐదు బ్లేడ్ల ఫ్యాన్లు కనిపిస్తాయి. చాలా మందికి ఈ డిజైన్‌ గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది. కానీ ఇది అలా కాదు… అసలైన విషయం ఏమిటంటే.. గొప్ప సీలింగ్  ఫ్యాన్ నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు ? మూడు బ్లేడెడ్ సీలింగ్ ఫ్యాన్ వెనుక గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం…

పరిశోధన ఏమి చెబుతుంది?

పరిశోధన ప్రకారం.. మంచి గాలి రావాలంటే కేవలం మూడు బ్లేడ్లు ఉండే ఫ్యాన్ సరిపోతుంది. ఎక్కువ బ్లేడ్లు కలిగి ఉండటం ఫ్యాన్ మోటారుపై ఒత్తిడి పెంచుతుంది. ఇది గాలిని విసిరే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

అయితే, చాలా చోట్ల దీని డిజైన్ పర్యావరణంపై కూడా ఆధారపడి ఉంటుంది. యుఎస్, కెనడాతోపాటు ఇతర శీతల వాతావరణ దేశాలలో నాలుగు బ్లేడెడ్ ఫ్యాన్ ఉపయోగిస్తారు. గది అంతటా గాలిని ప్రసరింప  చేయడానికి ఉపయోగిస్తారు.

మూడు బ్లేడ్ల యొక్క ప్రయోజనాలు..

భారతదేశం సమశీతల ఉష్ణమండల దేశం. సీలింగ్ ఫ్యాన్ ఇక్కడి గదికి చల్లదనాన్ని తెస్తుంది. అందువల్ల త్రీ-బ్లేడ్ ఫ్యాన్ వాడకం ఇక్కడ ఎక్కువ. తక్కువ బ్లేడ్ కారణంగా ఇది వేగంగా కదులుతుంది. అంతే కాదు శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నాలుగు బ్లేడ్ల కన్నా మూడు బ్లేడ్ల ఫ్యాన్‌కు విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీనితో పాటు వారు సామాన్య ప్రజల బడ్జెట్‌లో ఈ మూడు రెక్కల ఫ్యాన్ లభిస్తుంది. అంతే భారత దేశంలో మూడు రెక్కల ఫ్యాన్ అనుకూలమైనది. అందుకే భారత్‌లో ఎక్కడ చూసిన మీకు మూడు రెక్కల ఫ్యాన్లు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్