AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Shimla Tour: కొత్తగా పెళ్ళైన కపుల్స్ స్లిమా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఈ స్పెషల్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

అప్పుడే పెళ్ళైన దంపతులు.. హనీమూన్ కి .. యంగ్ కపుల్స్ ఎక్కడికైనా పర్వత శ్రేణుల ప్రాంతానికి టూర్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అటువంటివారికి ఐఆర్సీటీసీ టూరిజం శాఖ ఓ ప్రత్యేక ప్యాకేజీతో...

IRCTC Shimla Tour: కొత్తగా పెళ్ళైన కపుల్స్ స్లిమా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే  మీకోసమే ఈ స్పెషల్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..
Irctc Tourism
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2021 | 5:05 PM

IRCTC Shimla Tour: అప్పుడే పెళ్ళైన దంపతులు.. హనీమూన్ కి .. యంగ్ కపుల్స్ ఎక్కడికైనా పర్వత శ్రేణుల ప్రాంతానికి టూర్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అటువంటివారికి ఐఆర్సీటీసీ టూరిజం శాఖ ఓ ప్రత్యేక ప్యాకేజీతో అనేక ప్రాంతాలకు వెళ్లే వీలు కల్పిస్తుంది. తాజాగా రైల్వే టూరిజం శాఖ హైదరాబాద్ నుంచి సిమ్లా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ పర్యటనలో సిమ్లాతో పాటు.. ధర్మశాల, అమృత్‌సర్, చండీగఢ్ వంటి ప్రాంతాలను కూడా ఈ పర్యటనలో భాగంగా చేర్చింది.

ఈ ప్యాకేజీని హ్యాపీ హిమాచల్ విత్ పంజాబ్ పేరుతో అందిస్తోంది. మొత్తం 7 రోజుల టూర్ ఇది. 6 రాత్రులు ఉండే ఈ టూర్ 2021 ఏప్రిల్ 14న ప్రారంభం కానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఆరు రాత్రులు హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్ , , ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటి పెసిలిటీస్ అందిస్తుంది.

ఇక ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ముగ్గురు తీసుకుంటే రూ. 32,250 తో మొదలు అవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 33,950 కాగా.. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 47,950

ఏప్రిల్ 14న ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం 7. 30 ని. ఎక్కితే చండీ గఢ్ కు 10:25 గంటలకు చేరుకుంటారు. అక్కడ హోటల్లో బస చేసిన అనంతరం .. రాక్ గార్డెన్, సుఖ్నా సరస్సుని సందర్శించవచ్చు. రాత్రి అక్కడే బస చేసి మళ్ళీ ఉదయం అమృత్ సర్ కు బయలుదేరాల్సి ఉంది. మార్గ మధ్యలో జలంధర్ ను సందర్చించే వీలు కల్పిస్తుంది. అమృత్ సర్ కు చేరుకున్న అనంతరం వాఘా బార్డర్ కు తీస్కుకుని వెళ్లారు, రాత్రి మళ్ళీ అక్కడే బస చేసి.. మూడో రోజు ఉదయం గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలా భాగ్ కి తీస్కుని వెళ్తారు. అనంతరం అమృత్ సర్ నుంచి ధర్మశాలకు తీస్కుని వెళ్లారు, ఆ రోజు రాత్రి ధర్మశాలలోనే బస చేసే సదుపాయాన్ని కల్పించారు.

ఇక టూర్ లో నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టిబెటన్ మానస్ట్రీ, హెచ్‌పీ క్రికెట్ స్టేడియం సందర్శించాలి. రాత్రికి ధర్మశాలలోనే బస చేయాలి. మళ్ళీ ఐదో రోజు ఉదయం ధర్మశాల నుంచి స్లిమా కు బయలుదేరాలి. అక్కడ రాత్రి బస చేయాలి. ఇక ఆరోరోజు రాత్రి స్లిమా లోని పలు ప్రాంతాలు సందర్శించ వచ్చు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయాలి.. మర్నాడు టూర్ లో చివరి రోజు తిరిగి చండీ ఘడ్ చేరుకొని రాత్రి 7. 25 ప్లైట్ ఎక్కాలి,, రాత్రి 10 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో హిమాచల్ విత్ పంజాబ్ టూర్ ముగుస్తుంది. ఆసక్తి కలవారు ప్యాకేజీ వివరాలకోసం బుకింగ్ కోసం https://www.irctctourism.com/ కు లాగిన్ అవ్వొచ్చు.

Also Read: వేసవి దాహార్తిని తీర్చే రాయలసీమ స్పెషల్ డ్రింక్ నన్నారి షర్బత్..విశిష్టత ఏమిటంటే..!

ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!

'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..