Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. పావులు కదిపిన శివకుమార్.. సీఎం రేసులోకి మరో వ్యక్తి..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి అయ్యేది ఎవరనే అనేది హాట్ టాపిక్ అయింది. సరిగ్గా టైమ్ చూసుకొని సిద్ధరామయ్యకు చెక్ పెట్టడానికి డీకే శివకుమార్ కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ.. కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీటుపై కీలక నేతలు కన్నేశారు. దీంతో ఒకరికి మించి ఒకరు రాజకీయం నడుపుతున్నారు. ప్రధానంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య సీఎం సీటు పోటీ నెలకొంది. ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థి తామే అంటూ డైరెక్ట్‌గా ప్రకటించకపోయినా టైమ్ వచ్చిన ప్రతిసారి తానే సీఎం క్యాండెట్ అని ఎవరి వారు మెసేజ్‌లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే పేరును ప్రస్తావించి.. కన్నడ రాజకీయాన్ని తన వైపునకు తిప్పుకున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఖర్గే కోసం తన ఛాన్స్ వదులుకుంటానని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. దీంతో దళిత సీఎం చర్చ తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్ ఖర్గేకు మద్దతు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. దళిత సీఎం, స్థానిక వర్సెస్ వలస రాజకీయం చర్చ మొదలైంది. అయితే.. డీకే శివకుమార్ ఊరికే ఈ కామెంట్స్ చేయలేదని.. సిద్ధరామయ్యకు చెక్ పెట్టడానికే ఖర్గే పేరును ప్రస్తావించారనే టాక్ వినిపిస్తోంది. ఇటు తాను ముఖ్యమంత్రి అయితే ఖర్గే ఆధ్వర్యంలో పనిచేయడానికి ఇష్టపడతానని డీకే ప్రకటించారు. అక్కడితో ఆగకుండా.. గతంలోనూ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై.. అటు సిద్ధరామయ్య రియాక్ట్ అయ్యారు. హై కమాండ్ ఏ డిసిషన్ తీసుకున్న అంతా చేతులు కట్టుకొని నిలబడతామని చెప్పారు. అయితే ఖర్గే ప్రస్తుతం ఎన్నో కీలక బాధ్యతలు ఉన్నాయని.. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. చూడాలి కన్నడ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో..




మరిన్ని జాతీయ వార్తల కోసం..