Karnataka Elections: కాంగ్రెస్‌కు తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదు.. సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. ఏ పార్టీ చక్రం తిప్పనుందో ఈరోజే తెలనుంది. ప్రస్తుతం దేశ ప్రజలు కర్ణాటక ఫలితాల వైపే చూస్తున్నారు. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా భారతీయ జనతా పార్టీనే మెజారిటీ సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. ఏ పార్టీ చక్రం తిప్పనుందో ఈరోజే తెలనుంది. ప్రస్తుతం దేశ ప్రజలు కర్ణాటక ఫలితాల వైపే చూస్తున్నారు. ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా భారతీయ జనతా పార్టీనే మెజారిటీ సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల నుంచి, బుత్‌ల నంచి తమకు గ్రౌండ్ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ అభ్యర్థులను కలిపి ఉంచేందుకు రిసార్టులను బుక్ చేసిందనే కథనాలపై కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని తెలిపారు.
కాంగ్రెస్‌కు మెజారిటీ రాదని.. తాము ఇతర పార్టీలతో కూడా టచ్‌లో ఉన్నట్లు బొమ్మై తెలిపారు. అయితే కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 సీట్ల మేజిక్ ఫిగర్ రావాలి. అయితే కర్ణాటకను ఏ పార్టీ పాలించనుందో నేటితో తెలిసిపోతుంది.
మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..