Karnataka Election Results: కర్ణాటకలో హోరాహోరీ పోరు.. మెజారిటీ ఆ పార్టీదే..? టీవీ9 భారత్ వర్ష్ ట్రెండ్స్..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. భారీ భద్రత మధ్య 224 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్.. 36 కేంద్రాల్లో కొనసాగుతోంది. అయితే, కర్నాటక ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. భారీ భద్రత మధ్య 224 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్.. 36 కేంద్రాల్లో కొనసాగుతోంది. అయితే, కర్నాటక ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికివార్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. బీజేపీ కూడా గట్టిపోటితో దూసుకువస్తోంది. టీవీ9 భారత్ వర్ష్ ట్రెండ్స్ ప్రకారం.. కర్ణాటకలో హోరాహోరీగా పోరు నెలకొంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి అనంతరం ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే..
మొత్తం స్థానాలు.. 224.. మేజిక్ ఫిగర్ 113
- కాంగ్రెస్ 115
- బీజేపీ 88
- జేడీఎస్ 21
మెజారిటీ వైపు కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇవి కేవలం ట్రెండ్స్ మాత్రమే.. ఫలితాలు వెలువడేందుకు మరికొంత సమయం పడుతుంది.