KarnatakaElection2023: వెనుకంజలో కుమార స్వామి.. కన్నడ కురుక్షేత్రంలో ప్రభావం చూపని జేడీఎస్..

సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సీపీ యోగీశ్వరావు లీడ్‌‌లో ఉన్నారు.

KarnatakaElection2023: వెనుకంజలో కుమార స్వామి.. కన్నడ కురుక్షేత్రంలో ప్రభావం చూపని జేడీఎస్..
Jds' Kumaraswamy
Follow us
Sanjay Kasula

|

Updated on: May 13, 2023 | 9:34 AM

రామనగర జిల్లాలో చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున సీపీ యోగీశ్వరావు లీడ్‌‌లో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి గంగాధర్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కింగ్ మేకర్ అవుతారని అనుకున్న జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి తాజా పరిస్థితి ఇలా ఉండటంతో కర్నాటకలో సంచలనగా మారింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదని తేలిపోయింది.

కర్నాటకలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కౌంటింగ్ మొదలై ఫలితాలు వస్తున్నాయి. కన్నడ ప్రజలే కాదు.. అటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగగా.. 36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల 9.10 గంటల వరకు భాజపా 79, కాంగ్రెస్‌ 104, జేడీఎస్‌ 19, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కన్నడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలుతోంది. తిరిగి అధికారం సాధించే దిశగా బీజేపీ.. ఎలాగైనా కమలాన్ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ కష్టపడింది. దక్షిణాదిన బీజేపీ ఉనికి ఉన్న ఏకైన రాష్ట్రం కర్ణాటకనే. కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. ఈసారి రికార్డుస్థాయిలో 73.19 శాతం పోలింగ్‌ నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం