కిలాడీ మోసం.. వాట్సాప్‏లో హాయ్ అని మెసేజ్.. రిప్లై ఇచ్చి లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడంటే..

ఇటీవల సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియా స్నేహాలు

కిలాడీ మోసం.. వాట్సాప్‏లో హాయ్ అని మెసేజ్.. రిప్లై ఇచ్చి లక్షలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడంటే..
Whats App
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2021 | 8:38 AM

ఇటీవల సోషల్ మీడియా వినియోగం మరింత పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియా స్నేహాలు కూడా శ్రుతిమించుతున్నాయి. అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చిందంటే చాలు.. ఆలోచించకుండా ఆమె మాయలో పడిపోతున్నారు. మానసికంగానే కాకుండా.. ఆర్థికంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ మోసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇటీవల సైబర్ మోసాల సంఖ్య ఏ స్థాయిలో నమోదవుతున్నాయో తెలిసిందే. వాట్సప్, ఫేస్‏బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేసి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తికి వాట్సప్‏లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. దీంతో అతను రిప్లై ఇచ్చాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరిగి.. మాయలేడి ఉచ్చులో పడి ఏకంగా రూ. 23 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకెలితే.. అనంతరపురం జిల్లాలోని శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండు నెలల క్రితం అతడి మొబైల్‏కు హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. అయితే ఆ నంబర్ అమ్మాయి పేరు మీద ఉండడం.. ప్రొఫైల్ కూడా అమ్మాయి ఫోటోనే ఉండడంతో రిప్లై ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. ఆ తర్వాత క్రమంగా వారి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ తరచూ వాట్సాప్ కాల్స్, మెసేజులు చేసుకునేవారు. ఇంతలో ఆ మాయలేడీ నుంచి న్యూడ్ వీడియో కాల్స్ వచ్చాయి. ఇంకేముంది ముందు వెనకా ఆలోచించకుండా.. అతను కాల్స్ మాట్లాడాడు. అయితే ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వీడియోలను రికార్డ్ చేసిన ఆ మాయ లేడీ.. వాటిని సోషల్ మీడియాలో.. బంధువులకు షేర్ చేస్తానని బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. పరువుపోతుందని భావించిన ఆ వ్యక్తి దాదాపు రూ.23 లక్షల వరకు ఆ అమ్మాయికి పంపించాడు. అయినా ఆ కిలాడీ బెదిరింపులు ఆగలేదు. దీంతో విసిగిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరిచయం లేని వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. సైబర్ మోసాల బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‏లో గానీ.. సైబర్ మిత్ర వాట్సప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే కేవైసీ వెరిఫికేషన్ పేరుతో బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను ఎవరైనా అడిగితే చెప్పకూడదని సూచించారు.

Also Read: Traffic Police: అందులో నిజం లేదు.. ఆ వార్తను ఫార్వర్డ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్నింగ్‌.

Karthik Deepam: అన్నంత పనీ చేసిన మోనిత! షాక్ లో కార్తీక్..దీప..!

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే