Andhra Pradesh: అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వృద్ధురాలు

మానవసంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో సొంతవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇలాంటి...

Andhra Pradesh: అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన వృద్ధురాలు
Crime
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Jul 18, 2022 | 8:38 PM

మానవసంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. విచక్షణ కోల్పోయి, క్షణికావేశంలో సొంతవాళ్లు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో ఉన్న అత్తపై అల్లుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాచవరం మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన నల్లబోతుల బ్రహ్మంకు గుదె కస్తూరమ్మ కుమార్తె కామేశ్వరితో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి అల్లుడు నల్లబోతుల బ్రహ్మం, కుమార్తె కామేశ్వరితో కలిసి కస్తూరమ్మ ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. కస్తూరమ్మ కుమార్తె కామేశ్వరి హైదరాబాద్ లోని తన కుమారుడి వద్దకు వెళ్లింది.

నాలుగు రోజుల నుంచి కస్తూరమ్మకు అల్లుడు బ్రహ్మం ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ మొత్తం మీద అల్లుడు గొడ్డలితో కస్తూరమ్మ తల, నుదుటిపై గొడ్డలితో నరికాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..