Viral Video: నారీ శక్తికి సెల్యూట్.. హెవీ ట్రక్కు నడుపుతున్న మహిళ చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా

ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారు. దేశాన్ని పాలించాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా సాహసాలు చేసి ముందడుగు వేస్తున్నారు. కొన్ని సంవత్సరాల వరకు స్త్రీలను ఇంటికే పరిమితం చేశారు. వారిని గడప దాటి బయటకు...

Viral Video: నారీ శక్తికి సెల్యూట్.. హెవీ ట్రక్కు నడుపుతున్న మహిళ చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా
Woman Driving Truck Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 18, 2022 | 8:08 AM

ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారు. దేశాన్ని పాలించాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా సాహసాలు చేసి ముందడుగు వేస్తున్నారు. కొన్ని సంవత్సరాల వరకు స్త్రీలను ఇంటికే పరిమితం చేశారు. వారిని గడప దాటి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ మారుతున్న పద్ధతులు, సామాజిక కట్టుబాట్లతో ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తోంది. చదువు దగ్గరి నుంచి ఉద్యోగం వరకు అన్ని రంగాల్లో మహిళలు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ప్రపంచంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, కొన్ని విషయాల్లో మగవాళ్లు కూడా మహిళల కంటే వెనకే ఉన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నారు. అయితే.. రోడ్డు రవాణాలో అధికంగా ఉండేది పురుషులే. హెవీ ట్రక్కులు, బస్సులు, భారీ వాహనాలను నడపడానికి మగవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ విషయంలో మహిళలు వెనకబడే ఉన్నారు. కానీ ఓ మహిళ భారీ ట్రక్కును నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోడ్డుపై వేగంగా దూసుకుపోతున్న ట్రక్కును మహిళ నడపడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. వాహనాన్ని డ్రైవ్ చేస్తున్న మహిళ.. కెమెరా వైపు చూడగానే చిరునవ్వు నవ్వుతుంది. ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మనం కారు లేదా బైక్ నడిపే మహిళలను చూసి ఉంటాం. కానీ ట్రక్ నడుపుతున్న మహిళను మాత్రం ఈ వీడియోలోనే చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 62 వేలకు పైగా నెటిజన్లు చూశారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేశారు. ‘నారీ శక్తి’కి సెల్యూట్ అని, డ్రైవర్ ఇస్తున్న సందేశం ఆలోచనాత్మకంగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి