Telangana: బీజేపీపై సమరానికి అధినేత ఆదేశం.. హస్తిన వేదికగా పోరాటానికి ఎంపీలు సిద్ధం

అధినేత ఆదేశాలకు అనుగుణంగా టీఆర్ఎస్ (TRS) ఎంపీలు కేంద్రప్రభుత్వంపై సమరానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అంశాల వారీగా కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు. రాష్ట్రం పట్ల....

Telangana: బీజేపీపై సమరానికి అధినేత ఆదేశం.. హస్తిన వేదికగా పోరాటానికి ఎంపీలు సిద్ధం
Kcr
Follow us

|

Updated on: Jul 17, 2022 | 8:22 PM

అధినేత ఆదేశాలకు అనుగుణంగా టీఆర్ఎస్ (TRS) ఎంపీలు కేంద్రప్రభుత్వంపై సమరానికి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అంశాల వారీగా కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించారు. రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిని ఎండగడతామని, పార్లమెంటు ఉభయసభల్లో గళం వినిపిస్తామనీ చెబుతున్నారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ (KCR) చేసిన సూచనలను తూచ తప్పకుండా పాటించి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల పేరిట ఆర్థికంగా రాష్ట్రాన్ని అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు (Telangana) వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం, రాష్ట్రం మధ్య గోప్యంగా ఉండాల్సినవి వివరాల్ని సైతం లీక్‌ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక వ్యవహారాలను లీక్ చేయడం నేరపూరిత చర్యగా అభివర్ణించిన కేసీఆర్‌ దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఎంపీలకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పరిధులకు, ఎఫ్​ఆర్​బీఎం కు లోబడే ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందని ఎంపీలకు వివరించిన కేసీఆర్‌.. ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని చెప్పారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం వాస్తవం కాదా అని కేంద్రాన్ని ప్రశ్నించాలంటూ ఎంపీలకు సూచించారు. విద్యుత్ సంస్కరణల పేరిట.. రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తేవడాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని సూచించారు కేసీఆర్. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేయడంపై ప్రశ్నించాలని ఎంపీలకు వివరించారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి పోయింది ఎంత.. ? తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిందెంత? అనే లెక్కలు చూస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం అర్థమవుతుందని కేసీఆర్ .. పార్టీ ఎంపీలకు గుర్తు చేశారు. ఇప్పటికే, కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌… ఎంపీలనే అస్త్రాలుగా పార్లమెంటుకు పంపారు. హస్తినలో ల్యాండైన గులాబీ ఎంపీలు.. అధికనేత ఇచ్చిన 15 అంశాల లిస్టును పట్టుకుని పార్లమెంటుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పార్లమెంట్లో సర్కాను నిలదీసేందుకు సన్నద్ధమయ్యారు. పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు దాపురించాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు సమాఖ్య స్పూర్తికి, లౌకికవాదానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బీజేపీ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గళం విప్పాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా గుర్తు చేయాలి. కేవలం 30 శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువద్దని, మిగిలిన 70శాతం మంది దేశ ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయాలి. ప్రజా వ్యతిరేకత ఉద్ధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలూ ఉన్నాయి. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలి. ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలి.

          – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..