AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు.. సీఎంపై కాంగ్రెస్ నేతలు ఫైర్

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్లౌడ్‌ బరస్ట్‌ వల్లే రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి...

Telangana: కాళేశ్వరం నుంచి దృష్టి మరల్చేందుకే క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు.. సీఎంపై కాంగ్రెస్ నేతలు ఫైర్
Uttam Kumar Reddy
Ganesh Mudavath
|

Updated on: Jul 17, 2022 | 5:24 PM

Share

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్లౌడ్‌ బరస్ట్‌ వల్లే రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాలను చూడడానికి వెళ్లిన మరో నేత పొన్నాల లక్ష్మయ్య.. కాళేశ్వరం మానవ తప్పిదం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం వద్ద 12లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నప్పుడే పంప్‌హౌస్‌లు ఎలా మునుగుతాయని నిలదీశారు. కాళేశ్వరం ద్వారా 35లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి.. క్షేత్ర స్థాయిలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాగా.. భగవంతుని దయవల్లే కడెం ప్రాజెక్ట్‌ నిలబడిందని, క్లౌడ్‌ బరెస్ట్‌లకు కుట్ర జరిగినట్లు అనుమానాలున్నాయని సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఈ వరదలకు ఇతర దేశాల కుట్ర ఉందని అంటున్నారని, కావాలనే క్లౌడ్‌ బరస్ట్‌ చేశారంటున్నారని, గతంలో కశ్మీర్‌, లేహ్‌ దగ్గర ఇలాంటి ఘటనలు జరిగినట్లు వార్తలొస్తున్నాయన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం మునగడం బాధాకరమన్నారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

అనంతరం కేసీఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు ఉన్నాయని, ఎత్తైన ప్రదేశాల్లో కాలనీలు నిర్మించాలని కలెక్టర్‌కు ఆదేశించారు. వరద వల్ల ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని జిల్లాల అధికారులు కలిసి పని చేశారన్నారు. గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి