BDL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ – భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.2,60,000లు సంపాదించే అవకాశం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ మేనేజర్‌ తదితర పోస్టుల (Assistant Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

BDL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ - భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.2,60,000లు సంపాదించే అవకాశం..
Bdl
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2022 | 4:14 PM

Bharat Dynamics Limited Hyderabad Assistant Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ మేనేజర్‌ తదితర పోస్టుల (Assistant Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 18

ఇవి కూడా చదవండి

ఖాళీల వివరాలు: జనరల్ మేనేజర్ (HR), డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్), మేనేజర్ (ఎక్స్‌ప్లోసివ్స్), డిప్యూటీ మేనేజర్ (సివిల్), జూనియర్ మేనేజర్ (రష్యన్/ఆంగ్ల అనువాదం), సీనియర్ మేనేజర్ (సివిల్, ఎక్స్‌ప్లోసివ్స్), అసిస్టెంట్‌ మేనేజర్ తదితర పోస్టులు.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ పీజీ డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎమ్‌ఎస్‌/గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం డౌన్‌లోడ్ చేసుకుని పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించాలి.

అడ్రస్‌: SM, C-HR (TA&CP), Bharat Dynamics Limited, Corporate Office, Plot No. 38-39, TSFC Building (Near ICICI Towers), Financial District, Gachibowli, Hyderabad, Telangana-500032.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.500
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.