Crime Video: నోయిడాలో ఎన్‌కౌంటర్… పోలీస్ కాల్పుల్లో బైక్ దొంగలకు గాయాలు
నోయిడాలో దోపిడి దొంగల రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో నోయిడా సెక్టార్-49లో పోలీసులకు ,ఇద్దరు మోటార్‌సైకిల్ దొంగలకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు సెక్టార్ 76...

నోయిడాలో దోపిడి దొంగల రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో నోయిడా సెక్టార్-49లో పోలీసులకు ,ఇద్దరు మోటార్‌సైకిల్ దొంగలకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు సెక్టార్-76 మెట్రో స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు దొంగతనానికి ప్రణాళిక వేస్తున్నారని సమాచారం అందింది. ఆ సమాచారంపై స్పందించిన పోలీసులు మరొక బృందాన్ని రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో బరోలా టీ పాయింట్ వద్ద మోటార్‌సైకిల్‌పై వస్తున్న ఇద్దరిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే దొంగలు పోలీసులను అవహేళన చేసి, మోటార్‌సైకిల్‌ను తిరిగి సర్వీస్ రోడ్డుపై వేగంగా నడిపించారు. పోలీసులు వెటాడగా వారు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనాన్ని వదిలేసి అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. తమను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై కాల్పులు జరిపారు.
పోలీసులు కూడా తమను రక్షించుకునేందుకు కాల్పులు జరపగా ఇద్దరు దొంగలు గాయపడ్డారు. దొంగలు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అనిల్, కరణ్ శర్మగా గుర్తించారు. విచారణలో వారు ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి బంగారం, విలువైన వస్తువులు దొంగిలించేవారని, వాటిని తక్కువ ధరలకు విక్రయించేవారని తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




