రెండు ట్రక్కులో భారీగా డ్రగ్స్‌.. అసోం టూ మణిపూర్‌ వెళ్తుండగా..

గత కొద్ది రోజులుగా అసోం, త్రిపుర, మణిపూర్‌,వెస్ట్ బెంగాల్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్‌, పలు ఔషధాలు, మారణాయుధాలు..

  • Tv9 Telugu
  • Publish Date - 12:35 am, Mon, 27 July 20
రెండు ట్రక్కులో భారీగా డ్రగ్స్‌.. అసోం టూ మణిపూర్‌ వెళ్తుండగా..

గత కొద్ది రోజులుగా అసోం, త్రిపుర, మణిపూర్‌,వెస్ట్ బెంగాల్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్‌, పలు ఔషధాలు, మారణాయుధాలు పట్టుబడుతున్నాయి. తాజాగా.. మణిపూర్‌లోని కామ్‌జంగ్‌ ప్రాంతంలో అసోం రాష్ట్రీయ రైఫిల్స్‌ తనిఖీలు చేపట్టారు. బంగ్‌డంగ్‌ చెక్‌పోస్ట్ వద్ద చేప్టటిన తనిఖీల్లో రెండు ట్రక్కుల్లో పలు ఔషధాలు, డ్రగ్స్‌ను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.8 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు. అసోం రైఫిల్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ట్రక్కుల్లో పట్టుబడ్డ ఔషధాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేవని.. వీటిని దొంగచాటుగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.ఈ రెండు ట్రక్కులు ఇంపాల్‌ నుంచి వాంగేకు వెళ్తున్నట్లు విచారణలో వెళ్లడైందన్నారు. అయితే ఈ రెండు ట్రక్కుల ఔషధాలకు సంబంధించి 14 ఇన్‌ వాయిస్లు సమర్పించినా.. అవి సంబంధింత వ్యాపారస్థుల నుంచి స్టాంప్‌ వేసినవి కావని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు.