ఫాంహౌస్‌ వేదికగా వ్యభిచారం.. తనకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత..

యూపీలో ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ బయటపడింది. ఆగ్రా సమీపంలోని ఓ ఫాం హౌజ్ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ దందా కొనసాగుతున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో ముగ్గురు..

ఫాంహౌస్‌ వేదికగా వ్యభిచారం.. తనకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 4:34 AM

యూపీలో ఓ భారీ సెక్స్‌ రాకెట్‌ బయటపడింది. ఆగ్రా సమీపంలోని ఓ ఫాం హౌజ్ కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ దందా కొనసాగుతున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో పాటుగా మరో ఆరుగురిని ఆగ్రా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సదరు ఫాంహౌజ్‌ బీజేపీకి చెందిన ఓ జిల్లా నేతదిగా గుర్తించారు. అయితే ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని సదరు బీజేపీ నేత చెప్పుకొచ్చాడు. ఈ ఫాం హౌజ్‌ను మూడేళ్ల క్రితం సచిన్, విష్ణు,గోయల్ అనే వ్యక్తులకు లీజుకు ఇచ్చానన్నారు. వారు అక్కడ ఏం చేస్తున్నారన్నది తనకు తెలియదని.. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో కానీ.. ఘటనకు సంబంధించి కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

ఫాంహౌజ్‌ కేంద్రంగా అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని.. ఇక్కడి నుంచి వివిధ హోటళ్లకు, ఇతరులకు అమ్మాయిలను పంపిస్తుంటారని.. దీనిపై పక్కా సమాచారం అందుకున్న వెంటనే.. రైడ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సెక్స్ రాకెట్ వెనుక కొందరి పెద్దల హస్తం ఉందని.. విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆగ్రా పోలీస్ అధికారి తెలిపారు.