బ్యాంక్ ఉద్యోగుల చేతివాటం..చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి నగదు స్వాహా..
కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల నకిలీ లోన్లు, స్వయం చేతివాటాలు, ఫేక్ చోరీలు సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో కొత్త పద్దతిలో నిధుల స్వాహాకి తెరతీశారు ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు. చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి 25 లక్షల 8 వేలను తమ జేబుల్లోకి మళ్ళించుకున్నారు. తమిళనాడు.. వయలూర్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ […]
కొందరు బ్యాంక్ ఉద్యోగులు మరీ బరితెగిస్తున్నారు. టైమ్ టూ టైమ్ భారీగా జీతాలు వస్తున్నా కూడా ..అక్రమ సొమ్ము కోసం తప్పుడు మార్గాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే అనేకచోట్ల నకిలీ లోన్లు, స్వయం చేతివాటాలు, ఫేక్ చోరీలు సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో కొత్త పద్దతిలో నిధుల స్వాహాకి తెరతీశారు ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు. చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి 25 లక్షల 8 వేలను తమ జేబుల్లోకి మళ్ళించుకున్నారు. తమిళనాడు.. వయలూర్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో ఈ స్కామ్ చోటుచేసుకుంది. నిధులు మళ్లించుకుంది కూడా పెద్ద తలలైన ..మేనేజర్ షేక్ మోహిద్దీన్, అసిస్టెంట్ మేనేజర్ చిన్నాదురై .
ఎమిసోలా అనే మహిళకు వయలూర్‌లోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆమె ఖాతా నుంచి కొన్నాళ్ల వరకు బాగానే జరిగిన లావాదేవీలు సడన్‌గా ఆగిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చనిపోవడంతో అకౌంట్ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కాగా ఆ అకౌంట్‌లో సొమ్ము మాత్రం అలానే ఉంది. అందులో ప్రతి సంవత్సరం ఇంట్రస్ట్ కూడా జమ అవుతోంది. ఇక ఆ డబ్బుకోసం ఎవరూ రారులే అని భావించిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ షేర్ వేసుకోని సొమ్ము పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తరువాయి నకిలీ సంతకాన్ని సృష్టించి, ఏటీఎం కార్డుతో డబ్బు విత్ డ్రా చెయ్యడం మొదలెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన ఈ వ్యవహారం..సంస్థ సంవత్సర ఆడిట్ రిపోర్ట్‌లో బట్టబయలైంది. దీంతో ప్రస్తుతం ఆ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయిస్ ఊచలు లెక్కబెడుతున్నారు.