AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షితపై అత్యాచారం, హత్య: మృగాడు దొరికాడు..ఎర్ర బూట్లే పట్టించాయి

మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్‌ చేశారు.  చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకోని, క్లీన్ షేవ్ చేయించుకుని పారిపోయాడు. అభం, శుభం తెలియని..చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు కామాంధుడు. దారుణాతి దారుణంగా […]

వర్షితపై అత్యాచారం, హత్య: మృగాడు దొరికాడు..ఎర్ర బూట్లే పట్టించాయి
Ram Naramaneni
|

Updated on: Nov 16, 2019 | 5:39 PM

Share

మృగాడు దొరికాడు.. మనిషి ముసుగులో ఉన్న పశువు పోలీసులకు చిక్కాడు. చిన్నారి వర్షిత అత్యాచారం, హత్య కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్‌ చేశారు.  చిత్తూరు జిల్లా బసినికొండకు చెందిన రఫీ.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అతడిని..పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకోని, క్లీన్ షేవ్ చేయించుకుని పారిపోయాడు.

అభం, శుభం తెలియని..చిన్నారి జీవితాన్ని చిదిమేశాడు కామాంధుడు. దారుణాతి దారుణంగా 5 ఏళ్ల  పసిపాపను అపహరించి, తీవ్రంగా హింసించి అత్యాచారం చేసి చంపేశాడు కిరాతకుడు. చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి, ముగ్గురు బిడ్డల్లో వర్షితే ఏకైక కుమార్తె. అప్పుడే తమ ముందు ఆడుకుంది. పెళ్లిలో తెగ హడావిడి చేసింది. కానీ అంతలోనే మాయమైంది. చిన్నారిని ఫోటోలు తీసి, ఆటపట్టించి, మాయమాటలు చెప్పి ..అర్థరాత్రి 12 గంటల సమయంలో కిడ్నాప్ చేశాడు దుండగుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించగా..తెల్లారాక శివారు ప్రాతంలో పాప డెడ్ బాడీ లభ్యమైంది. 

పట్టించిన నిందితుడి ఎర్ర బూట్లు:

సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుడి ఫేస్ సరిగ్గా కనిపించకపోవడంతో..మొదట ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. కానీ నిందితుడు గెటప్ ఛేంజ్ చేయడంతో..ఎటువంటి క్లూ లభించలేదు. కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో..నిందితుడి ధరించిన ఎర్ర బూట్లపై పోలీసుల దృష్టి పడింది. అప్పటికే చూచాయగా అనుమానితుడ్ని గుర్తించిన పోలీసులు..అతడి భార్యకు సీసీ విజువల్స్ చూయించగా..అక్కడ ఉన్న వ్యక్తి ధరించిన బూట్లు తన భర్తవే అని ఆమె తేల్చేసింది. దీంతో పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టి.. ఛత్తీస్‌గఢ్‌‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దుండగుడు గతంలో కూడా చిన్నారులను లైంగికంగా వేధించినట్టు పోలీసులకు సమాచారం అందింది.

Follow Us
హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..
హైదరాబాద్ నుంచి సూపర్ టూర్.. పూరీ, కోణార్క్, చిలికా సహా ప్రముఖ..
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులపాటు సెలవులు
ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ
ప్రత్యేక ఆకర్షణగా 'ఎకో గణపతి'..500 kg కూరగాయలతో శాకాంబరీ అలంకరణ
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికా ఖజానాకు బిగ్ షాక్!
500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!
500 మందికి పులిహోర.. ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!
అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్
అక్క చేతిలో ఐఫోన్ నొక్కేసిన కోతి..కట్ చేస్తే జ్యూస్ ఆఫర్‌తో సీన్
వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా
వినాయకుడికి ఇష్టమైన శెనగల ప్రసాదం.. 250 మందికి సరిపోయేలా
ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ
ఈ సినిమా ఉంటది రా చారి.. ఓటీటీలో రచ్చ చేస్తున్న 19 ఏళ్ల నాటి మూవీ
కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?
కోట్ల ఏళ్ల రహస్యం.. పెట్రోల్ అరబ్ దేశాల్లోనే ఎందుకుంటుంది.. ?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.!
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు.!