Crime: పొరుగు రాష్ట్రాల వాహనాలే టార్గేట్.. బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు యువకుల అరెస్ట్..

krishna district nandigama: ఆ ముగ్గురు రాత్రి సమయంలోనే బయటకు వెళ్తారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలే వారి టార్గేట్.. అలాంటి వాహనాలు, లారీలను

  • Shaik Madarsaheb
  • Publish Date - 2:38 pm, Thu, 22 April 21
Crime: పొరుగు రాష్ట్రాల వాహనాలే టార్గేట్.. బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు యువకుల అరెస్ట్..
arrest

krishna district nandigama: ఆ ముగ్గురు రాత్రి సమయంలోనే బయటకు వెళ్తారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలే వారి టార్గేట్.. అలాంటి వాహనాలు, లారీలను చూసి ఆపుతారు. అధికారులమంటూ బెదిరించి.. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు దండుకుంటారు. వారు చెప్పటినట్లు వినకపోయినా.. డబ్బులు ఇవ్వకపోయినా.. లారీ డ్రైవర్లపై దాడులు చేస్తారు. బాధితుల దగ్గర ఏమున్నా లాక్కొని మరి పంపిస్తారు. అలాంటి ముగ్గురు యువకుల ఆటకట్టించారు కృష్ణా జిల్లా పోలీసులు. వివరాలు.. కొంతకాలం నుంచి జిల్లాలోని చందాపురం బైపాస్ రోడ్ వద్ద ముగ్గురు వ్యక్తులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లారీలను ఆపి డబ్బులు దండుకుంటున్నారు.

పలువురి నుంచి వచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు వారి కదలికలపై పోలీసులు కన్నేశారు. టల్లూరి వెంకటేష్, కటరాపు విజయ్, కంభంపల్లి అర్జున్ ముగ్గురూ కూడా లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తుండగా.. కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ ముగ్గురు యువకులు కూడా లారీ డ్రైవర్ల నుండి డబ్బు, ఫోన్లు, కొన్ని వస్తువులను దోచుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

సమాచారం మేరకు నిందితుల కదలికలపై దృష్టి సారించామని.. అనంతరం ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని నందిగామ సీఐ కనకారావు, ఎస్ఐ తాతా చారి పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. గత కొంతకాలం నుంచి వీరంతా ఇదే పనులు చేస్తున్నారని.. ఎంత వరకూ డబ్బు వసూళ్లు చేశారు.. ఇంకా ఏమైనా దందాలకు పాల్పడుతున్నారా.. అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Also Read:

Crime: పుదుచ్చేరిలో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. అనంతరం మూటగట్టి..

Couple Dies: కృష్ణాజిల్లాలో దారుణం.. నిద్ర పోతున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన భర్త.. ఆ తర్వాత తాను ఏంచేశాడంటే..?