Couple Dies: కృష్ణాజిల్లాలో దారుణం.. నిద్ర పోతున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన భర్త.. ఆ తర్వాత తాను ఏంచేశాడంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. తాళి కట్టిన భర్తే ఆమె పాలిటి కాలయముడయ్యాడు. తెల్లారేసరికల్లా కడతేర్చాలనుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Couple Dies: కృష్ణాజిల్లాలో దారుణం.. నిద్ర పోతున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన భర్త.. ఆ తర్వాత తాను ఏంచేశాడంటే..?
Murder
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 22, 2021 | 11:25 AM

Man kills self after burning wife: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. తాళి కట్టిన భర్తే ఆమె పాలిటి కాలయముడయ్యాడు. తెల్లారేసరికల్లా కడతేర్చాలనుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నిద్ర పోతున్న భార్యపై పెట్రోలు పోసి భర్త నిప్పుపెట్టిన ఘటన జిల్లాలోని పామర్రు పమిడి ముక్కల మండలం మంటాడలో జరిగింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అర్తనాదాలకు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. మంటలు ఆర్పి తీవ్ర గాయాలతో ఉన్న మహిళను స్థానికులు ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మాధవి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

ఇదిలావుంటే, భార్యకు నిప్పు పెట్టిన భర్త బధుబాబు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పక్క గదిలోనే మెడకు ఉరి వేసుకుని భర్త మధుబాబు (35) ఆత్మహత్య చేసుకున్నాడు.సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న భర్త మధుబాబు.. కాలి గాయం కావడంతో నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదే క్రమంలో భార్యభర్తలు ఇద్దరి మధ్య ఘర్షణ చోటుకుని, క్షణికావేశంలో ప్రాణాల మీదుకు వచ్చింది. కాగా, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Read Also.. సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… కోవిడ్ సోకి ప్రముఖ దర్శకుడు మృతి… విషాదంలో చిత్రయూనిట్..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?