సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం… కోవిడ్ సోకి ప్రముఖ దర్శకుడు మృతి… విషాదంలో చిత్రయూనిట్..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటు ఆసుపత్రులలో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడుస్తున్నారు.. ఇక ఈ మహామ్మారి సినీ పరిశ్రమపై మరోసారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది సెలబ్రెటీలు మరణించగా.. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. పలువురు నటీనటులకు కరోనా భారిన పడడంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలాగే మరికొన్ని చిత్రాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న ఈ వైరస్ బారిన పడి టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ సీఎన్ రావు కన్నుమూయగా.. తాజాగా మరో దర్శకుడు ఈ మహమ్మారికి బలయ్యాడు. corona virus
శాండల్ వుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముక డిజైనర్, దర్శకుడు మస్తాన్ (63) (Director Mustan) మంగళవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఈయనకు జరిపిన కరోనా పరీక్షలలో పాజిటివ్ వచ్చింది. దీంతో హెసరఘట్టలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి మరణించారు. 40 ఏళ్ల నుండి శాండల్‌వుడ్‌లో రెండు వేలు సినిమాలకు పోస్టర్ డిజైనర్‌గా సేవలందించారు. శుక్లాంబరధరం, కల్లేశీ మల్లేశీ, సితార సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు నటీ అనుప్రభాకర్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో తెలిపారు. భర్త రఘు ముఖర్జీకి నెగిటివ్ వచ్చినట్లు చెప్పారు. (Corona second wave)
Also Read: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.22 ఆదా చేస్తే.. ఏకంగా రూ.8 లక్షలు పొందవచ్చు…
Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..
మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్మెంట్కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..