Attack on Doctor: చిన్న కారణంతోనే డ్యూటీలో ఉన్న డాక్టర్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?
ఒక డాక్టర్ పై దాడి చేసినందుకు గాను ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఘటన చోటు చేసుకుంది. నిందితుడు కత్తితో డాక్టర్ పై దాడి చేశాడు.
Attack on Doctor: ఒక డాక్టర్ పై దాడి చేసినందుకు గాను ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఘటన చోటు చేసుకుంది. నిందితుడు కత్తితో డాక్టర్ పై దాడి చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో సహాయంతో అతనిని గుర్తించారు పోలీసులు. సంఘటన వివరాలిలా ఉన్నాయి.
నాందేడ్ జిల్లా ఆసుపత్రి కోవిడ్ వార్డ్ కు భూసాహేబ్ గైక్వాడ్ తన బంధువులను చూడటానికి వెళ్ళాడు. అక్కడ అతను గట్టిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. రోగి బంధువులు.. ఇతర పేషెంట్స్ అభ్యంతరం చెప్పినా తన తీరు మార్చుకోలేదు. వార్డు నుంచి బయట వున్న లాబీలోకి వచ్చి కూడా గట్టిగ మాట్లాడుతూనే ఉన్నాడు. దీంతో అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ అతనిని గట్టిగ మాట్లాడవద్దని హెచ్చరించారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన నిందితుడు కోపంగా తన దగ్గర ఉన్న కత్తితో డాక్టర్ పై దాడి చేశాడు. అక్కడ ఉన్న సిబ్బంది.. డాక్టర్ ను అతని దగ్గరనుంచి పక్కకు లాగి రక్షించారు. ఆ డాక్టర్ కు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఆ తరువాత డాక్టర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు, విధులలో ఉన్న సిబ్బందిని ఆటంకపరిచిన కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పెద్ద మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో దేశంలో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుంటే.. నాందేడ్ జిల్లలో కూడా అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో క్యుములిటివ్ పాజిటివిటీ రేటు 16.3 శాతం ఉంది. ఇప్పటివరకూ మొత్తం 40,27,827 కేసులు నమోదు అయ్యాయి.
PM Modi West Bengal Tour : రేపటి తన పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ