Absconding: పదిహేనేళ్ళుగా ఉద్యోగం ఎగ్గొట్టేశాడు..అయినా జీతం మాత్రం తీసుకుంటూనే ఉన్నాడు..అసలు అలా ఎలా?
ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోతేనే.. ఎందుకు రాలేదు.. ఏమైపోయావు.. ఇలా ప్రశ్నల పరంపర ఎదుర్కోవాలి.. అలాగే, చెప్పకుండా మానేసినందుకు పైవాళ్ళు వేసే అక్షింతల్నీ భరించాలి. ఏ ఉద్యోగికైనా ఇంతే కదా.
Absconding: ఒకరోజు డ్యూటీకి వెళ్ళకపోతేనే.. ఎందుకు రాలేదు.. ఏమైపోయావు.. ఇలా ప్రశ్నల పరంపర ఎదుర్కోవాలి.. అలాగే, చెప్పకుండా మానేసినందుకు పైవాళ్ళు వేసే అక్షింతల్నీ భరించాలి. ఏ ఉద్యోగికైనా ఇంతే కదా. ఒకవేళ మానేసిన రోజుకు పై అధికారి లీవ్ ఒప్పుకోకపోతే…జీతంలో కొత్త తప్పదు. ఇంతే కదా.. ఏ ఉద్యోగికైనా జరిగేది. కానీ, ఒక వ్యక్తి ఒకటీ రెండూ రోజులూ నెలలూ కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు డ్యూటీ ఎగ్గోట్టేశాడు. కానీ, మనోడికి జీతం మాత్రం కచ్చితంగా అందేస్తూనే ఉంది. అదేమిటి? ఎలా? మీకూ కుతూహలంగా ఉంది కదూ..ఆ కథేమిటో తెలుసుకుందాం!
ఇటలీలో ఈ ఘటన జరిగింది. ఒక ఉద్యోగి 2005 నుంచి తాను పనిచేస్తున్న ఆసుపత్రికి వెళ్ళడం మానేశాడు. కానీ, జీతం మాత్రం తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గార్డియన్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఈ వ్యక్తి పేరు సాల్వేటోర్ సుమాస్. ఇతను కాటాన్జారో నగరంలో ఒక ఆసుపత్రిలో పనిచేసేవాడు. అయితే, ఈ పదిహేనేళ్ళు ఉద్యోగం చేయకపోయినా, ఇతనికి అందిన జీతం అక్షరాలా 5,38,000 యూరోలు. ప్రస్తుతం ఈయన వయసు 66 ఏళ్లు. పోలీసులు ఇప్పుడు ఇతన్ని విచారిస్తున్నారు. ఇతనితో పాటు హాస్పిటల్ కు చెందిన ఆరుగురు మేనేజర్లను కూడా ఈ కేసులో బుక్ చేశారు పోలీసులు. సుమాస్ డ్యూటీకి రాకపోయినా అటెండెన్స్ ఎలా ఇచ్చారనే విషయంపై వారి నుంచి సమాచారం రాబడుతున్నారు.
ఇంతకీ ఈయనగారు ఉద్యోగానికి ఎందుకు రావడం లేదు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. 2005 లో ఆ ఆసుపత్రి డైరెక్టర్ ను తనపై క్రమశిక్షణా చర్యలకు సిఫారసు చేయవద్దని బెదిరించాడు. ఆ గొడవల మధ్యలో అతను ఆసుపత్రికి రావడం మానేశాడు. ఆ తరువాత ఆ డైరక్టర్ కూడా రిటైర్ అయిపోయారు. అయితే, సుమాస్ ఆసుపత్రికి రాకపోయినా, ఆసుపత్రికి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, ఎకౌంగ్స్ డిపాట్మెంట్ గానీ ఈ విషయాన్ని గమనించలేదు. అతనికి హాజరు.. దానితో పాటు జీతమూ వచ్చేస్తూ వచ్చింది. 2016 లో ఇటలీ ప్రధాని అక్కడి ఉద్యోగుల విషయంలో ఉన్న చట్టాలను కఠినతరం చేశారు. అన్ని విభాగాల్లో ఉద్యోగులకు సంబంధించిన వివరాలనూ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అన్ని మోసాలను బయటకు తీయాలని చెప్పారు. దీంతో జరిపిన విచారణతో ఈ విషయం బయటకు వచ్చింది.
Also Read: PM Kisan: మీరు పీఎం కిసాన్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నారా…? డబ్బులు రావడం లేదా..? అయితే ఇలా చేయండి
క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ