క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ

వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెను సవాల్ అని, అయితే క్లీన్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో....

క్లైమేట్ ఛేంజ్ పై సాహసోపేత చర్యలు చేపట్టాం., ప్రధాని మోదీ వెల్లడి., ఇది నిరంతర ప్రక్రియ
Pm Modi.
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Apr 22, 2021 | 7:30 PM

వాతావరణ కాలుష్య నివారణకు ఇండియా పలు సాహసోపేత చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. క్లైమేట్ ఛేంజ్ అన్నది పెను సవాల్ అని, అయితే క్లీన్ ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ సాధించాలన్న లక్ష్యంతో ఇండియా వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పారు.  ఇందుకోసం అంతర్జాతీయ  సౌర కూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను తమ దేశం సమర్థించిందని ఆయన చెప్పారు. వాతావరణ కాలుష్యం వల్ల తలెత్తే విపరీత పరిణామాల కారణంగా మానవ మనుగడ ప్రమాదంలో పడుతోందని ఆయన అన్నారు.  ఈ నేపథ్యంలోనే దీని మార్పు కోసం పటిష్టమైన చర్యలు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. హరిత విప్లవ సాధన కోసం భారత, అమెరికా దేశాలు కృషి చేస్తున్నాయని అన్నారు.  ఇందుకు తాను, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్..2030 నాటికల్లా ఇండియా-యూఎస్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ కి  సంబంధించిన లక్ష్య సాధన  కోసం అజెండాను రూపొందించామని  వెల్లడించారు.  పలు ఇతర దేశాల్లోని కార్బన్ కాలుష్యం కన్నా ఇండియాలో ఈ కాలుష్యం 60 శాతానికన్నా తక్కువగా ఉందని మోదీ చెప్పారు. దశాబ్దాల తరబడి కాలుష్య నివారణకు కృషి జరగాలని సూచించిన ఆయన ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తు చేశారు.

క్లైమేట్ ఛేంజ్ పై గురువారం జరిగిన 40 దేశాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో వర్చ్యువల్ గా ప్రధాని పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బ్రిటిష్ పీఎం బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో తదితరులు పాల్గొన్నారు.  ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కొనేందుకు దేశాధినేతలంతా కృషి చేయాలని తీర్మానించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Narendra Modi: కరోనా కట్టడకి రేపు ప్రధాని నరేంద్రమోదీ మూడు కీలక సమావేశాలు.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

అస‌లే క‌రోనా టైమ్.. ఇమ్యూనిటీ చాలా అవ‌స‌రం.. వీటితో రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోండి..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!