అసలే కరోనా టైమ్.. ఇమ్యూనిటీ చాలా అవసరం.. వీటితో రోగ నిరోధక శక్తి పెంచుకోండి..!
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా అంతగా ప్రభావం చూపదని ఆరోగ్య నిపుణులు అనడంతో అందరూ వాటినే ఎక్కువగా తీసుకుంటున్నారు.
వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా అంతగా ప్రభావం చూపదు… ఇమ్యూనిటీ పవర్‌ను అధికం చేసే శక్తి పెరుగులో ఉంది…. పుట్టగొడుగుల్లో విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్…..
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా అంతగా ప్రభావం చూపదని ఆరోగ్య నిపుణులు అనడంతో అందరూ వాటినే ఎక్కువగా తీసుకుంటున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్‌ను అధికం చేసే శక్తి పెరుగులో ఉంది. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి.
ఇక గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యరశ్మి తగిలేలా ఉదయానే పదిహేను నిమిషాలు వాకింగ్ చేయాలి. విటమిన్ డి కలిపిన బలవర్ధకమైన పాలను తీసుకోవాలి.
పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ పై పోరాడే తెల్ల రక్త కణాలను పుట్టగొడుగులు ఉత్తేజపరిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.
Also Read: కరోనా కల్లోలంలో వైరల్ అవుతున్న ఫోటో.. ఇది రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన..ప్రూఫ్ ఇదిగో..