AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బ్రేకింగ్… షాకింగ్.. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయి పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకే

హైదారాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ...

Hyderabad:  బ్రేకింగ్... షాకింగ్.. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయి పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకే
Huge Quantity Of Ganja Seized
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2021 | 8:37 PM

Share

హైదారాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద 3,400 కిలోల గంజాయిని ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ  రూ.21 కోట్లు ఉండదని చెప్పారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తోన్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7,500 కిలోల గంజాయి అధికారులు పట్టుకున్నారు.  గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో 25 మందిని ఎన్‌సీబీ అధికారులు  అరెస్ట్ చేశారు.

యువతను చిత్తు చేస్తోన్న గంజాయి…

గంజాయి మత్తులో యువత జీవితాలను పాడు చేసుకుంటున్నారు. గంజాయికి బానిసలుగా మారి బంగారంలాంటి భవిష్యత్‌ను చిదిమేసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ యువత గంజాయికి బానిసలయినట్లు తెలుస్తోంది. తాజాగా మెండోరా మండలం బుస్సాపూర్‌లో గంజాయి మత్తులో  ఓ యువకుడు అకారణంగా రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిపై గొడ్డలితో దాడిచేయడంతో మృతి చెందాడు. బాల్కొండలో కొందరు యువకులు గంజాయికి మైకంలో బైక్‌ల చోరీకి పాల్పడిన ఉదంతం ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా గ్రామాల్లో గంజాయిని అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా గంజాయి మత్తులో యువకులు విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఆ మైకంలో ఏం చేస్తున్నామో కూడా గుర్తించలేని స్థితిలో ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన గిరిజన యువకుడు సిద్ధార్థను గంజాయి మత్తులోనే హత్య చేశారన్నది స్థానికుల వెర్షన్. ఈ హత్య తదనంతరం ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం.. పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిన విషయమే. మెండోరా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒక యువకుడిపై కొందరు యువకులు గంజాయి సేవించి హత్యాయత్నం చేశారు. చివరకు రాజీపడి కేసు నుంచి బయటపడ్డారు. మోర్తాడ్‌లో ఒక యువకుడు గంజాయి మత్తులో బైక్‌ను వేగంగా నడిపి ఒక కూలీ మరణానికి కారణమయ్యాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. నిర్మల్, నిజామాబాద్‌ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా ఓ రేంజ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోచంపాడ్‌ గంజాయి వ్యాపారులకు అడ్డాగా ఉందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఉన్నతాధికారులు స్పందించి గంజాయి విక్రయాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Also Read:  స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి కీలక కామెంట్స్.. వారికి హెచ్చరిక

ఓ మంచి పని చేసిన రోజా.. అయినా కానీ పాపం ఊహించని విధంగా ప్రతిపక్షాలకు దొరికిపోయారు