Guntur: గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు
Guntur ex Soldier Firing: భూతగాదాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మాచర్ల మండలం రాయవరంలో మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. పొలం వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాయవరం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మట్టా సాంబశివరావు తుపాకీతో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులు అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు మాచర్ల ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి మాజీ జవాన్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్టార్ హీరోకు ఝలక్ ఇచ్చిన దొంగలు.. సినిమా స్టైల్లో కారు చోరి.. టెక్నాలజీని వాడడంలో వీళ్లు వీరలెవల్..