AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Schools: స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి కీలక కామెంట్స్… వారికి హెచ్చరిక

సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల....

Telangana Schools: స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి కీలక కామెంట్స్... వారికి హెచ్చరిక
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2021 | 8:38 PM

Share

సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు టీవీ9తో చెప్పారు. 18 నెలలుగా స్కూళ్లు మూతపడటంతో పిల్లలకు సైకలాజికల్ గా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష తరగతులతో పోలిస్తే ఆన్ లైన్ క్లాసులు అంత ఎఫెక్టివ్ గా ఉండవన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో చిన్నచిన్న సమస్యలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్న సబితా ఇంద్రారెడ్డి… గ్రామ సర్పంచుల సహకారంతో వాటిని అధిగమించాలంటూ హెడ్మాస్టర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను సిద్ధంచేయడం, వసతుల కల్పించడంలో లోకల్ బాడీస్ తప్పనిసరిగా ఇన్వాల్స్ కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈనెల 30లోపు స్కూళ్లలో క్లీనింగ్ పనులు పూర్తి కాకపోతే హెడ్మాస్టర్లనే బాధ్యులుగా చేస్తామంటూ హెచ్చరించారు. 31లోగా స్కూళ్లను సిద్ధంచేసి రిపోర్ట్ ఇవ్వాలని హెడ్మాస్టర్లను ఆదేశించినట్లు మంత్రి సబిత తెలిపారు. స్కూల్స్ రీఓపెన్ పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమంటున్నారో దిగువన వీడియోలో చూడండి.

Also Read:షాకింగ్.. మహిళను పొడిచిన బర్రె… కొమ్ములపైన శవంతో రాత్రంతా తిరుగుతూ..

ఓ మంచి పని చేసిన రోజా.. అయినా కానీ పాపం ఊహించని విధంగా ప్రతిపక్షాలకు దొరికిపోయారు

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..