బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లు, రాళ్లతో దాడి.. నార్కెట్‌పల్లి అద్దంకి హైవేపై బీజేపీ శ్రేణుల ఆందోళన
మిర్యాలగూడ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో, రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
Attack on Bandi Sanjay Convoy: నల్గొండ మండలం ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద రైతులతో ముఖాముఖీ ముగించుకుని మిర్యాలగూడ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో, రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే, ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ శ్రేణులంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాన్వాయ్ పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.