Vizag: విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. కార్పొరేట్‌ కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌గా కొకైన్ సప్లై

విశాఖలో డ్రగ్స్‌ కలకలం రేగింది. నగరంలోని కార్పొరేట్‌ కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌గా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

Vizag: విశాఖలో డ్రగ్స్‌ కలకలం.. కార్పొరేట్‌ కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌గా కొకైన్ సప్లై
Cocaine
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 15, 2021 | 9:08 AM

విశాఖలో డ్రగ్స్‌ కలకలం రేగింది. నగరంలోని కార్పొరేట్‌ కాలేజ్‌ విద్యార్థులే టార్గెట్‌‌గా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. స్టూడెంట్స్‌కు అమ్మేందుకు బెంగళూరు నుంచి కొకైన్‌ను తీసుకొచ్చారు. ఐతే వారిని పట్టుకున్న పోలీసులు..30గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కొకైన్‌ రవాణా గురించి కూపీ లాగితే సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. కార్పోరేట్‌ కాలేజ్‌ విద్యార్థులకు కొకైన్‌ అమ్మేందుకే తీసుకొచ్చామని విచారణలో వెల్లడించారు నిందితులు. ఈ కొకైన్‌ సరఫరాలో రౌడీ షీటర్‌ రాంకీ కీలక సూత్రధారిగా గుర్తించారు. ఈ రాంకీ గతంలో కూడా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నాడని రౌడీ షీట్‌ కూడా ఓపెన్‌ చేశారు. మళ్లీ ఇప్పుడు కొకైన్‌ సరఫరా చేస్తుండటంతో..అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కొకైన్‌ దందలో ఇంకెవరెవరున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఐతే ఈ కొకైన్‌ దందాను గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.

అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం జగన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గా కాలేజీ/ వర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండకూడదని దిశానిర్దేశం చేశారు.  డ్రగ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి.. సప్లై గురించి ఆరా తీసి.. మూలాల నుంచి పెకిలించివేయాలన్నారు.  దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

Also Read:  Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

Andhra Pradesh: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు