Gangula Kamalakar: ఏకంగా మంత్రినే టార్గెట్ చేసిన దుండగులు.. నకిలీ ఈడీ నోటీసులో బెదిరింపులు

ఆయన తెలంగాణ కేబినెట్‌లో కీలక మంత్రి. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ముఖ్య పాత్రదారు. కాని ఆయన భద్రతే ప్రమాదంగా మారిందా?...

Gangula Kamalakar: ఏకంగా మంత్రినే టార్గెట్ చేసిన దుండగులు.. నకిలీ ఈడీ నోటీసులో బెదిరింపులు
Gangula Kamalakar
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 25, 2021 | 12:35 PM

ఆయన తెలంగాణ కేబినెట్‌లో కీలక మంత్రి. రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ముఖ్య పాత్రదారు. కాని ఆయన భద్రతే ప్రమాదంగా మారిందా? అంటే తాజా పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. కేటుగాళ్లు ఆయననే టార్గెట్ చేశారు. ఉదయాన్నే ఫేక్‌ నోటీసులు కలకలం సృష్టించారు. కేటుగాళ్ల టార్గెట్ మంత్రి గంగుల కమలాకర్‌పై పడ్డట్లు ఉంది. ఏకంగా మంత్రికే ఫేక్ నోటీసులు పంపారు ఛీటర్స్. అరెస్ట్ చేస్తామంటూ ఈడీ పేరుతో నకిలీ నోటీస్‌ సర్వ్ చేశారు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐతే వారు పంపించిన నోటీసులు, ఫోన్ కాల్ సంభాషణపై అనుమానం రావడంతో మంత్రి గంగుల కమలాకర్ ఈడీ అధికారులను సంప్రదించారు. ఐతే తాము ఎలాంటి నోటీసులు పంపలేదని ఈడీ అధికారులు చెప్పడంతో మంత్రి షాకయ్యారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీకి సమాచారం ఇచ్చారు. నకిలీ నోటీస్‌పై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఈడీ కూడా ఫిర్యాదు చేసింది. 420, 468, 471 కింద కేసు నమోదు చేశారు. కెనడా నెంబర్‌తో మంత్రి గంగులకు ఐవోఎస్‌ కాల్స్ చేస్తున్నారు ఆగంతకులు.

ఏకంగా మంత్రినే కేటుగాళ్లు టార్గెట్ చెయ్యడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం వెనుక విషయం ఏంటి? మంత్రిని టార్గెట్ చేయడంలో ఉద్దేశాలేంటి? మంత్రిని టార్గెట్ చేశారా? లేదంటే దాని వెనుక ఉద్దేశాలేవైనా ఉన్నాయా? ఈడీ పేరుతో నోటీసులు ఇవ్వడానికి కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల వేడి పీక్‌ స్టేజ్‌లో ఉన్న వేళ.. ఈ ఘటన కలకలం రేపుతోంది. గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ కంపెనీకి ఇటీవల ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. గ్రానైట్ తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ మంత్రి కంపెనీకి నోటీసు ఇష్యూ చేసింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేసిన దుండగులు.. తాజాగా నకిలీ నోటీసులో హల్చల్ చేశారు.

Also Read:పండక్కు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి ఎన్ని అడుగులో తెలుసా..?

Viral Video: ఈ వ్యక్తి టైమింగ్‌కి మీరు ఫిదా అవుతారు.. దెబ్బకు దొంగ బొక్కబోర్లాపడ్డాడు