Viral Video: ఈ వ్యక్తి టైమింగ్‌కి మీరు ఫిదా అవుతారు.. దెబ్బకు దొంగ బొక్కబోర్లాపడ్డాడు
మీరు సోషల్ మీడియాను ఉపయోగించేవారు అయితే ప్రతిరోజు రకరకాల వీడియోలు మీకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు...
మీరు సోషల్ మీడియాను ఉపయోగించేవారు అయితే ప్రతిరోజు రకరకాల వీడియోలు మీకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. కొన్ని ఎమోషనల్ వీడియోలు ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఓ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక వ్యక్తి దొంగను పట్టించిన విధానం మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తుంది. దొంగ కూడా ఇంత దారుణంగా పట్టుబడతానని తాను కూడా ఊహించి ఉండడు. ఈ ఇన్సిడెంట్ అంతా సినిమా స్టైల్లో జరిగింది.
ముందుగా వీడియో వీక్షించండి
Hold my beer while stop this thief. ?? pic.twitter.com/7qhCxIZyQz
— ? Hold My Beer ? (@HldMyBeer) August 23, 2021
వీడియోలో షాప్ వద్ద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండటం మీరు చూడవచ్చు. ఇంతలో ఒక దొంగ షాపులో చోరీ చేసి.. ఆ వీధిలో పరిగెత్తుతూ వస్తున్నాడు. అతడిని కొందరు తరుముతూ ఉన్నారు. దొంగ రావడాన్ని గమనించిన షాపు ముందు ఉన్న ఓ వ్యక్తి.. తన వద్ద ఉన్న కుర్చీని రోడ్డుపై విసిరేశాడు. దీంతో దొంగ కాళ్లకు కుర్చీ తగలడంతో కిందపడిపోయాడు. దీంతో అందరూ వచ్చి సదరు దొంగను పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు కుర్చీ విసిరిన వ్యక్తి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. లైక్లు, షేర్లు చేయడమే కాకుండా తమ మార్క్ కామెంట్స్ పెడుతున్నారు. “దొంగ తాను ఈ విధంగా పట్టుబడతానని లైఫ్‌లో ఊహించి ఉండడు అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఈ వీడియో ట్విట్టర్‌లో ‘@Hl0dMyBeer’ పేరుతో షేర్ చేయబడింది. వార్త రాసే సమయం వరకు 80 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూశారు. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా.. అయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Also Read: ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హెచ్‌సీయూ.. ఐదేళ్లలో 9 మంది బలవన్మరణం