Narayan Rane: 20 ఏళ్లలో తొలిసారి..కేంద్ర మంత్రిగా పని చేస్తూ అరెస్టయిన నారాయణ్ రాణే
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రిగా కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన నారాయణ్ రాణే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో దేశంలో దుమారం సృష్టించారు. దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని థాక్రే మరిచిపోయారని.....
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖల మంత్రిగా కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన నారాయణ్ రాణే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో దేశంలో దుమారం సృష్టించారు. దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని థాక్రే మరిచిపోయారని, తానైతే ఆయనను లెంపదెబ్బ కొట్టి ఉండేవాడినని చేసిన వ్యాఖ్యతో ఆయనను నాసిక్ పోలీసులు అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఇటీవలే మరో వివాదంలో కూడా ఆయన చిక్కుకున్నారు. .. తన జన ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించేముందు ఆయన ముంబైలో దివంగత శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే స్మారకం వద్ద నివాళులర్పించేందుకు రాగా.. ఆ ప్రాంతాన్ని అయన అపవిత్రం చేశారంటూ శివసైనికులు గోమూత్రంతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు.20 ఏళ్లలో తొలిసారి..కేంద్ర మంత్రిగా పని చేస్తూ అరెస్టయిన రాణే రాజకీయ జీవితమంతా కాస్త ఎగుడుదిగుడుగా వివాదాస్పద ఉదంతాలతోనే గడిచింది. మొదట శివసేనలో చేరి.. ఆ తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. , అనంతరం దాన్ని కూడా వీడి సొంత పార్టీ (కుంపటి) పెట్టి దాన్ని బీజేపీలో విలీనం ,చేసి.. చివరకు ఈ పార్టీలో తేలారు.
ఒక్కసారి ఈయన పొలిటికల్ కెరీర్ లోకి తొంగి చూస్తే..1999 లో రాణే శివసేన శాఖా ప్రముఖ్ (లోకల్ వార్డు చీఫ్) గా తన రాజకీయ జీవనాన్ని ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అదే ఏడాది బీజేపీ-శివసేన ప్రభుత్వంలో సీఎం అయ్యారు. నాడు బాలాసాహెబ్ థాక్రే ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయన్ను పార్టీనుంచి బహిష్కరించారు. ఎన్నికల్లో పార్టీ టికెట్లను ఆయన సేన కార్యకర్తలకు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. 2005 జులైలో ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దాంతో అదే ఏడాది నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చివరకు 2017 లో ఆ పార్టీని వీడారు. 12 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. పార్టీలో తనకు అన్యాయమే జరిగిందని, సీఎంను చేస్తానన్న కాంగ్రెస్ హామీని ఆ పార్టీ నిలబెట్టుకోలేదంటూ దానికి దూరమయ్యారు. 2017 అక్టోబరులో మహారాష్ట్ర స్వాభిమాన్ పార్టీ అని సొంత పార్టీ పెట్టారు. 2018 లో బీజేపీకి మద్దతు ప్రకటించి .. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019 అక్టోబరులో తన సొంత పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇక కొంకణ్ జిల్లాలో శ్రీధర్ నాయక్ అనే శివసేన కార్యకర్త హత్యతో బాటు కొన్ని నేరాల్లోనూ ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఇంత ‘సుదీర్ఘ’ పొలిటికల్ కెరీర్ ఉన్న రాణే పోలీసు మెట్లెక్కిన తొలి కేంద్ర మంత్రిగా (ఆ) ‘ప్రతిష్ట మూటగ ట్టుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల…: TS EAMCET Result 2021 Live Video.
కన్నింగ్ లేడీ.. హనీట్రాప్ కేసులో కీలకం.. ముగ్గురి పేర్లతో ఒకే యువతి మోసం..:Honeytrap Case Video.
Kohli Drinking Water Video: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధర ఎంతో తెలుసా..?వామ్మో ఇంత ధరనా..?