CM Amarinder: పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత యుద్ధం.. సీఎం అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు జెండా..
పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్‌లో..
పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుకు ఇక ఫుల్ స్టాప్ పడినట్టు కనిపించడం లేదు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. CM అమరీందర్‌పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, MLAలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది MLAలు సమావేశమయ్యారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, MLAలు బయల్దేరినట్లు సమాచారం.
కాగా ఇటీవల PCC అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది MLAలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
కాంగ్రెస్ హైకమాండ్ నవజోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ చీఫ్‌గా చేసిన తర్వాత మరింత హీట్ పెంచుతోంది. రాష్ట్ర పార్టీలో రోజు రోజుకు కోల్డ్ మరింత పెరుగుతోంది.శాంతి కపోతాలు ఎగరేసిన పార్టీ వర్గాలు.. అంతలోనే తిరుగుబాటు జెండాను ఎత్తుకున్నారు. పార్టీ 80 మందిలో 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఇక్కడ ఇతర పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కనీసం నలుగురు మంత్రులు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేబినెట్ మంత్రి ట్రిప్ట్ రాజిందర్ సింగ్ బజ్వా అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి సిద్ధూతోపాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు దూరంగా ఉన్నారు. అయితే, సమావేశం తర్వాత కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సిద్ధుని కలిశారు.
సమావేశానికి హాజరైన మరో మంత్రి చరంజీత్ సింగ్ చన్నీ, నలుగురు మంత్రులు , సిద్ధు విధేయుడు, ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్ సహా ఆరుగురు డెహ్రాడూన్ వెళ్లి కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌చార్జ్ హరీష్ రావత్‌ను కలవాలని నిర్ణయించారుకున్నారు. ఇందు కోసం AICC చీఫ్‌తో అపాయింట్‌మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..