Fraud Case: నిధుల దుర్వినియోగం కేసులో.. మాజీ మంత్రి, ఆమె భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష..

Indira Kumari Case: అవినీతి కేసులో అన్నాడీఎంకే నాయకురాలు, తమిళనాడు మాజీ మంత్రి ఇందిరాకుమారితో సహా ముగ్గురు వ్యక్తులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇందిరా

Fraud Case: నిధుల దుర్వినియోగం కేసులో.. మాజీ మంత్రి, ఆమె భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష..
Indra Kumari
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 29, 2021 | 1:21 PM

Indira Kumari Case: అవినీతి కేసులో అన్నాడీఎంకే నాయకురాలు, తమిళనాడు మాజీ మంత్రి ఇందిరాకుమారితో సహా ముగ్గురు వ్యక్తులను ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇందిరా కుమారి భర్తను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇందిరాకుమారి భర్త బాబు వికలాంగుల కోసం ఒక స్కూల్ నడుపుతూ ప్రభుత్వం నుంచి రూ .15.45 లక్షలు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ మంత్రి ఇందిరాకుమారి, ఆమె భర్త బాబు, సన్నిహితుడు షణ్ముగంను దోషులుగా తమిళనాడు కోర్టు నిర్ధారించింది. ఇందిరాకుమారి 1991-96లో అన్నాడీఎంకే జయలలిత క్యాబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు నిధుల దుర్వినియోగంతోపాటు అవినీతి జరిగినట్లు కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులో చిక్కుకున్న చిరుబాకరన్ మరణం తర్వాత వెంకట కృష్ణన్ విడుదలయ్యారు. అయితే.. ఈ అవినీతి కేసులు మరో ముగ్గురు దోషుల శిక్ష వివరాలను తరువాత ప్రకటిస్తామని చెన్నై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. దోషిగా తేలిన అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇందిరాకుమారి ప్రస్తుతం డీఎంకే పార్టీలో ఉన్నారు. 2006లో ఆమె ఏఐడీఎంకే నుంచి డీఎంకేలో చేరారు. ప్రస్తుతం ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Also Read:

Gold Smuggling: వామ్మో.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారి.. ప్రయాణికుడు దాచిన ప్రదేశం చూసి షాకైన అధికారులు..

Crime News: నిందిస్తున్నారంటూ చిన్నారి అఘాయిత్యం.. ఆన్‌లైన్‌లో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..