AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Smuggling: వామ్మో.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారి.. ప్రయాణికుడు దాచిన ప్రదేశం చూసి షాకైన అధికారులు..

Gold Seized: గోల్డ్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగా స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో

Gold Smuggling: వామ్మో.. బంగారం స్మగ్లింగ్‌కు కొత్త దారి.. ప్రయాణికుడు దాచిన ప్రదేశం చూసి షాకైన అధికారులు..
Gold Smuggling
Shaik Madar Saheb
|

Updated on: Sep 29, 2021 | 11:18 AM

Share

Gold Seized: గోల్డ్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగా స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ప్రాణానికి ప్రమాదమని తెలిసినా స్మగ్లర్లు వెనుకాడటం లేదు. తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ ప్రయాణికుడి నుంచి సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. స్మగ్లింగ్‌ను చేధించడం కంటే.. ప్రయాణికుడు బంగారం అక్రమ రవాణా కోసం ఎంచుకున్న ప్రదేశాన్ని చూసి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంఫాల్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అనుమానంతో ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు. అనుమానంతో పరిశీలించగా.. అతని దగ్గర 900 గ్రాముల బరువున్న.. సుమారు రూ. 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్‌ క్యాప్సుల్స్‌ లభించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. 909.68 గ్రాముల బరువున్న నాలుగు మెటల్ పేస్ట్ ప్యాకెట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అసలు ట్విస్ట్‌ ఏమిటంటే.. ప్రయాణికుడిని పరీక్షిస్తున్నప్పుడు అతని మల ద్వారం లోపల మెటల్ ఉండటాన్ని గమనించారు. పలుమార్లు ప్రశ్నించినప్పటికీ చెప్పకపోవడంతో ఎక్స్‌రే తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికుడి మల కుహరం లోపల 909.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి నాలుగు ప్యాకెట్లలో దాచినట్లు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తెలిపారు. ప్రయాణికుడి పేరు మహ్మద్ షరీఫ్‌ అని.. అతను కేరళలోని కోజికోడ్‌లో ఉంటాడని సిబడ్బంది తెలిపారు. నిందితుడు మంగళవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో అతని మీద అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో.. ఎక్స్‌రే తీయించగా అసలు విషయం తెలిసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. స్మగ్లింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Crime News: నిందిస్తున్నారంటూ చిన్నారి అఘాయిత్యం.. ఆన్‌లైన్‌లో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..

Prison Gang Clash: జైలులో మారణకాండ.. 24 మంది ఖైదీలు దుర్మరణం.. బాంబులు, తుపాకులతో..