Illegal Affair: నలుగురు పిల్లల తల్లి.. భర్త ఊరెళ్లాడని.. లవర్‌ను పిలిచింది.. చివరకు అడ్డంగా..
ఆమెకు పెళ్లైంది.. చక్కగా కాపురం చేసుకుంటుంది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు పెళ్లి కాని యువకుడితో ఏర్పడిన పరిచయం...
ఆమెకు పెళ్లైంది.. చక్కగా కాపురం చేసుకుంటుంది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు పెళ్లి కాని యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. బయట ఎక్కడో అయితే ఎవరికైనా తెలుస్తుందని మహిళ ఇంట్లోనే వారు కలిసేవాళ్లు. యువకుడు మహిళ ఇంటికి తరుచూ వెళ్లడాన్ని చూసిన కొంతమంది.. గ్రామస్థులకు చెప్పారు. అయితే ఆదివారం అర్ధరాత్రి కూడా వాళ్లిద్దరు కలిశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. యువకుడి చేతులు కట్టేసి కొట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు మహిళ భర్త ఊళ్లో లేడు.
జార్ఖండ్‌లోని షాహిబ్‌గంజ్ జిల్లాలోని రాజామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ నలుగురు పిల్లల తల్లికి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆమె భర్త ఊళ్లో లేనప్పుడల్లా ఆ వివాహిత ఇంటికే యువకుడు నేరుగా వెళ్లేవాడు. యువకుడు మహిళ ఇంటికి వెళ్లడాన్ని గమనించిన కొంత మంది నిఘా పెట్టారు. గత ఆదివారం రాత్రి కూడా ఆ వివాహిత భర్త ఊళ్లో లేడు. ఏదో పని మీద వేరే ఊరు వెళ్లాడు. దీంతో ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసింది. ‘ఆయన ఊరు వెళ్లారు.. ఇవాళ రారు.. నువ్వు రావాలని’ కోరింది. ప్రియురాలు పిలవడంతో వెంటనే ఆ యువకుడు అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికే నిఘా ఉంచిన గ్రామస్థులు యువకుడు ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడకు వెళ్లారు. ఓ గదిలో పిల్లలు నిద్రిస్తుండగా మరో గదిలోకి ప్రియుడిని తీసుకెళ్లిన ఆ వివాహిత నగ్నంగా ఉన్న స్థితిలో ఆ యువకుడితో రాసలీలలు సాగిస్తోంది. వాళ్లిద్దరినీ ఆ స్థితిలో చూసిన గ్రామస్థులు తలుపులు బద్ధలు కొట్టి ఇద్దరినీ బయటకు ఈడ్చుకొచ్చారు.
యువకుడి చేతులు కట్టేసి చితకబాదారు. పిడిగుద్దులతో దాడి చేశారు. ఆ మహిళపై కూడా దాడి చేశారు. ఈ ఘటనను గ్రామస్థుల్లో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో రాజామహల్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రణీత్ పటేల్ స్పాట్‌కు చేరుకుని ఆ మహిళను, యువకుడిని స్టేషన్‌కు తరలించి విచారించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం సదరు వివాహిత ఆ యువకుడితో ప్రేమలో పడిందని.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని తెలిసింది.
Read Also.. Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. పండంటి బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి కాసేపటికే షాక్
Crime News: నిందిస్తున్నారంటూ చిన్నారి అఘాయిత్యం.. ఆన్‌లైన్‌లో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..