Crime News: నిందిస్తున్నారంటూ చిన్నారి అఘాయిత్యం.. ఆన్‌లైన్‌లో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..

Girl dies by Suicide: క్షణికావేశంలో కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కుంటుంబాలకు శోకాన్ని మిగుల్చుతున్నారు. చిన్నారులు సైతం క్షణికావేశంలో.. ఆత్మహత్య చేసుకుంటూ

Crime News: నిందిస్తున్నారంటూ చిన్నారి అఘాయిత్యం.. ఆన్‌లైన్‌లో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకొని..
Suicide
Follow us

|

Updated on: Sep 29, 2021 | 10:08 AM

Girl dies by Suicide: క్షణికావేశంలో కొంతమంది బలవన్మరణానికి పాల్పడుతూ కన్నవారికి కుంటుంబాలకు శోకాన్ని మిగుల్చుతున్నారు. చిన్నారులు సైతం క్షణికావేశంలో.. ఆత్మహత్య చేసుకుంటూ విషాదాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఓ బాలిక సైతం బలవన్మరణానికి పాల్పడింది. ఆ బాలికకు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ.. అద్దం ముక్కతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసేసుకుంది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో చోటుచేసుకుంది.

అంబాజీపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో బాలిక కుటుంబం విజయవాడలో నివసించేది. అయితే.. భర్త కరోనాతో మరణించిన అనంతరం భార్య.. కొడుకు, కూతురుతో పుట్టింటికి వచ్చి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. పోలీసుస్టేషన్లో పంచాయితీలు కూడా నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ గొడవలన్నింటికీ కారణం తనేనని అందరూ నిందిస్తున్నారంటూ బాలిక (13) మనస్తాపం చెందింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్‌రూమ్‌లోకి వెళ్లి అద్దం ముక్కతో గొంతు కోసుకుంది. చివరకు నొప్పి తట్టుకోలేక అరుస్తూ బయటికొచ్చింది. బాలికను రక్తపుమడుగులో చూసిన కుటుంబసభ్యులు వెంటనే అమలాపురంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో బాలిక మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చనిపోవడానికి ముందు రోజు గొంతు వద్ద చాకు, అద్దం, బ్లేడు.. లాంటి పరికరాలతో కోసుకుంటే ఎంత సేపటికి చనిపోతామంటూ తల్లిని ప్రశ్నించిందని.. ఆతర్వాత దీని గురించి ఆన్‌లైన్‌లో కూడా చూసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని పలు వివరాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబాజీపేట పోలీసులు తెలిపారు.

Also Read:

Ganja Nursery: విల్లాలో గంజాయి సాగు.. ఎంబీఏ కోసం భారత్‌కు వచ్చి రూ.కోట్లల్లో వ్యాపారం.. చివరకు..

Prison Gang Clash: జైలులో మారణకాండ.. 24 మంది ఖైదీలు దుర్మరణం.. బాంబులు, తుపాకులతో..