పొలిటికల్ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి రూ. కోట్ల భూములు కొట్టేశారు..! ఇదీ.. స్కెచ్

టీవీ9 వరుస కథనాలతో నెల్లూరు జిల్లాలో భూ అక్రమార్కుల బండారం బయటపడింది. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు... పొలిటికల్ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి

పొలిటికల్ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి రూ. కోట్ల భూములు కొట్టేశారు..! ఇదీ.. స్కెచ్
Land Scam
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 29, 2021 | 10:59 AM

Chittoor Land Scam: టీవీ9 వరుస కథనాలతో నెల్లూరు జిల్లాలో భూ అక్రమార్కుల బండారం బయటపడింది. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు… పొలిటికల్ లీడర్లు, రెవెన్యూ అధికారులు కలిసి కోట్ల రూపాయల భూములను కొట్టేశారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో జరిగిన ఈ భూ కుంభకోణాన్ని టీవీ9 వెలుగులోకి తేవడంతో అక్రమార్కుల డొంక కదిలింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం సర్వే నెంబర్ 94/3లో 271 ఎకరాల భూములు ఉన్నాయి. 2010 లో ఈ భూములను పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములన్నీ డైరెక్టర్ ఆఫ్ పోర్టు పేరుతో ఉండగా… 209 ఎకరాల రికార్డులను తారుమారు చేశారు అక్రమార్కులు. కంపెనీ పేరు మీద నుంచి 11మంది పేర్లపై దొంగ పట్టాలు చేశారు. ఎకరాకు 21లక్షల 70వేల చొప్పున సుమారు 46కోట్లకు అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్నారు.

చిల్లకూరు భూకుంభకోణంపై జిల్లా కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించడంతో మొత్తం డొంక కదిలింది. ఆర్డీవో మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు చిల్లకూరు పోలీస్‌ స్టేషన్‌లో 13మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఏ1గా తహశీల్దార్ గీతావాణి, ఏ2గా సీనియర్ అసిస్టెంట్ షేక్ సిరాజ్, ఏ3గా దొడ్డిబోయిన సుబ్రమణ్యం, ఏ4గా ఆకుల లక్ష్మి, ఏ5గా కోటా శంకరయ్య, ఏ6గా పైడ సుదర్శనమ్మ, ఏ7గా దాసరి రఘురామయ్య, ఏ8గా చదలవాడ శాంతమ్మ, ఏ9గా తుమ్మల పద్మావతి, ఏ10గా బత్తుల పార్వతమ్మ, ఏ11గా బత్తుల జయమ్మ, ఏ12గా జంబుల జగదీశ్వర్‌రెడ్డి, ఏ13గా వనుకూరి అంకమ్మరావును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

అయితే, ఈ కుంభకోణంతో తనకు సంబంధం లేదంటున్నాడు కంప్యూటర్ ఆపరేటర్ నవీన్. కేవలం, ఎమ్మార్వో చెప్పినట్లు మాత్రమే తాను చేశానంటున్నాడు. గీతావాణి కూడా తనకేమీ సంబంధం లేదంటోంది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదని చెబుతోంది. అప్పటి ఎమ్మార్వో గీతావాణి అండదండలతోనే భూ రికార్డుల గోల్‌మాల్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటేశారు జిల్లా కలెక్టర్. గీతావాణితోపాటు ఆర్ఐ షేక్ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌ను సస్పెండ్ చేశారు. అయితే, చిల్లకూరు ల్యాండ్ స్కామ్‌లో ఎవరెవరి పాత్ర ఏంటో తేల్చేందుకు ఇంకా విచారణ జరుగుతోందన్నారు గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ. చిల్లకూరు భూకుంభకోణంపై విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read also: Janasena Vs YSRCP: క్యారెక్టర్ లేని పవన్ గురించి మాట్లాడను.. ఏపీ డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు