Janasena Vs YSRCP: క్యారెక్టర్ లేని పవన్ గురించి మాట్లాడను.. ఏపీ డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు
క్యారెక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నా వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
Pawan Kalyan – Dy CM Narayana Swami: క్యారెక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నా వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మహిళలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ తన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలన్నారు. పవన్ కళ్యాణ్ కు మనసనేదేలేదు.. ఆయన మహిళలను ఏవిధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారు. కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాడు ప్రజా నాయకుడు కాకూడదని రెండు చోట్ల ప్రజలే తిరుస్కరించారు అని నారాయణ స్వామి తిరుపతిలో చెప్పుకొచ్చారు.
” పవన్ కళ్యాణ్ సినిమాలను చూసి యువకులు మాట్లాడచ్చు కానీ నాది ఆయన గురించి మాట్లాడేంత చిన్న మనస్తత్యం కాదు. పరిపాలన దక్షత లేని ఉద్రేకపూరితమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడు బీజేపీలో ఉంటాడో, ఎప్పుడు టీడీపీలో ఉంటాడో తెలియదు. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ తీసుకొచ్చిన నవరత్నాలను ఏవిధంగా తప్పని అంటారని నేను పవన్ ను ప్రశ్నిస్తున్నా.. వైపీపీ నవరత్నాలపై తప్పుబడుతున్న పవన్ కళ్యాణ్‌పై ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది.” అని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ కులస్తులే ఆయన చేసేది తప్పని ఎదురుతిరిగే రోజు వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జోస్యం చెప్పారు.
ఇలాఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో పర్యటించనున్నారు. అయితే, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ విమర్శలు.. దానికి వైసీపీ నేతల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అటు పోసాని పవన్‌పై చేసిన ఆరోపణల నేపథ్యంలో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళగిరి టూర్‌ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే అవకాశం ఉండటంతో అటు జనసేన కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో మంగళగిరిలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
కాగా, వైసీపీ నేతలు చేస్తున్న మూకుమ్మడి కామెంట్స్‌పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంతోపై మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలపై కాపు సంక్షేమ సేన స్పందించింది. దీనికి సంబంధించి ఒక లేఖ విడుదల చేసింది. కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనక ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది. పవన్‌ను అవమానించడం అంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమేనని పేర్కొంది. 2024 ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య సదరు లేఖలో పేర్కొన్నారు.
Read also: Huzurabad: తెలంగాణ హిస్టరీలో హుజూరాబాద్ బై పోల్ హైలీ ఎక్స్‌పెన్సబుల్.! ఇంతకీ విజేత ఎవరు?