Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారికి అందుతున్న సేవలపై సుప్రీంలో పిటిషన్.. విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు

శ్రీవారికి అందుతున్న సేవలపై అపెక్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు సీజేఐ ఎన్వీ రమణ.

TTD: శ్రీవారికి అందుతున్న సేవలపై సుప్రీంలో పిటిషన్.. విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు
Cji On Tirumala Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 30, 2021 | 7:40 AM

తిరుమలలో శ్రీవారికి అందుతున్న సేవలు, ఇతర పూజాది కార్యక్రమాల్లో అవకతవకలు, తప్పులు జరుగుతున్నాయంటూ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందన తెలపాలని టీటీడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో, అపెక్స్‌ కోర్టును ఆశ్రయించారు పిటిషనర్. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం. పిటిషనర్ టీటీడీ బోర్డుకు రిప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని తెలుసుకుని, దానిపై స్పందనేంటో తెలపాలని టీటీడీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అయితే దేవస్థానంలో పూజలు ఎలా నిర్వహించాలి? ఆ క్రతువుల్లో ఎంతమంది పాల్గొనాలి? అనే విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇవన్నీ కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం జరగాలని ఆశించింది. తామంతా బాలాజీ భక్తులమేనని, సాంప్రదాయం ప్రకారం పూజలు జరగాలని కోరుకుంటున్నామని కామెంట్‌ చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.

పిటిషనర్ తన కేసును తానే వాదించుకోగా, ఆయనతో తెలుగులో మాట్లాడారు సీజేఐ ఎన్వీ రమణ. స్వామివారి భక్తుడిగా పిటిషనర్ కాస్త ఓపిక వహించాలని, తన కేసును జాబితాలో చేర్చాల్సిందిగా బెదిరించడం తగదని వారించారు సీజేఐ. స్వామివారికి జరిగే అభిషేకం, తోమల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏకాంత సేవ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాలఘు దర్శనం వంటి సేవలను పూర్తిగా తప్పుడు పద్ధతుల్లో నిర్వహిస్తున్నారని పిటిషనర్ తెలిపారు. వాటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో కోరారు.

అనంతరం సీజేఐ టీటీడీ తరఫు న్యాయవాదిని పిలిచి పిటిషనర్‌ 2020 మార్చి 28న టీటీడీకు ఇచ్చిన వినతిపత్రంపై మీరేం చర్య తీసుకున్నారో చెప్పండని ఆదేశించారు. అందుకు వారం రోజుల గడువు కావాలని న్యాయవాది కోరగా, సీజేఐ అంగీకరించారు.

Also Read: ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి