Huzurabad: తెలంగాణ హిస్టరీలో హుజూరాబాద్ బై పోల్ హైలీ ఎక్స్‌పెన్సబుల్.! ఇంతకీ విజేత ఎవరు?

ఇది రెండు పార్టీల మధ్య పోటీనా..?.. ఓ వ్యక్తికి ఓ పార్టీకి మధ్య సమరమా? పార్టీ లేకుంటే వ్యక్తిలేడు అని చెప్పే యుద్ధమా ? అన్న ప్రశ్నలకు

Huzurabad: తెలంగాణ హిస్టరీలో హుజూరాబాద్ బై పోల్ హైలీ ఎక్స్‌పెన్సబుల్.! ఇంతకీ విజేత ఎవరు?
Huzurabad By Election
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 29, 2021 | 7:05 AM

Telangana By Election – Huzurabad: ఇది రెండు పార్టీల మధ్య పోటీనా..?.. ఓ వ్యక్తికి ఓ పార్టీకి మధ్య సమరమా? పార్టీ లేకుంటే వ్యక్తిలేడు అని చెప్పే యుద్ధమా ? అన్న ప్రశ్నలకు అక్టోబర్‌ 30న ప్రజల ఓట్లరూపంలో తీర్పు ఇస్తే.. నవంబర్ 2న రిజల్ట్‌ తెలియబోతోంది. బీజేపీ నుంచి పేరు అనౌన్స్ చేయకపోయినా..ఈటల రాజేందరే అభ్యర్ధి. వేరే ఆప్షన్ లేదు కాషాయానికి ఆవిషయం వారికీ తెలుసు. ఇటు అధికార పార్టీ నుంచి అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్. కానీ బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్న కటౌట్ కేసీఆర్‌ది కాబట్టి గెలుపు నల్లేరుపై నడకే అన్న టాకు ఓవైపు నడుస్తున్నా.. ఈటల రాజేందర్ పొలిటికల్ గ్రాఫ్ చూస్తే ఎవరికీ గెలుపు అంత వీజీ కాదనిపిస్తోంది. వరుసగా ఆరుసార్లు గెలిచిన చరిత ఈటలది. ప్రత్యర్ధి ఎవరైనా ఓడించే ఘనత గులాబీది.. అందుకే విజయలక్ష్మి ఎవర్ని వరిస్తుందన్నదానిపై ఉత్కంఠ.

హుజూరాబాద్ అంటేనే సామాజిక లెక్కలు పక్కాగా పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం ఓటర్లు – 2 లక్షల 36 వేలుంటే..బీసీలు లక్షా 32వేలు, దళితులు 45వేలు, ఓసీలు 31వేలు, మైనార్టీలు 6వేలు, ఎస్టీలు 2వేలు..సో..ఇక్కడ బీసీలదే అగ్రతాంబూలం తర్వాత స్థానం దళితులదే. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా దళితబంధును తెరపైకి తెచ్చారని ప్రత్యర్ధులు విమర్సిస్తున్నా..ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అంటూ ఆ విమర్శలను గులాబీబాస్ తిప్పికొడుతూ..దళితబంధును జనంలోకి విజయవంతంగా తీసుకెళ్లింది.

ఆర్నెళ్లుగా హుజురాబాద్ లో నాన్‌స్టాప్ పొలిటికల్ పిక్చర్ అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గెలిచినా ఓడినా అధికారపార్టీకి ఫరక్ పడదు…కానీ ప్రతిష్ట పలుచనయ్యే ప్రమాదం ఉంది. ఫలితం తారుమారైతే వచ్చే టాక్ బీజేపీ చేతిలో ఓడిన టీఆర్ఎస్ అన్న ట్యాగ్‌లైన్ రాదు..ఈటల చేతిలో ఓడిన గులాబీ పార్టీ అన్న ట్యాగ్‌లైన్ ట్రెండ్ అవుద్ది. ఇది ఏమాత్రం అధికార పార్టీ యాక్సెప్ట్ చేయలేని క్యాప్షన్. అందుకే పార్టీకంటే వ్యక్తి గొప్పోడు కాదని..పార్టీ అండలేనిదే వ్యక్తి లేడని నిరూపించాలన్నదే గులాబీ బాస్ టార్గెట్. అది ఈ ఎన్నికల్లో చూపాలని ఆర్నెళ్ల కిందటే మంత్రులు ముందే మకాం పెట్టారు. మంత్రికో మండలం చొప్పున కేటాయించి ఇంటింటికీ తిరుగుతూ..ప్రచారం చేస్తోంది. దీనికి కీ బాధ్యుడిగా గులాబీ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు నియమించింది.

ఇక ఈటల రాజేందర్ అదే స్థాయిలో పాదయాత్ర చేస్తూ..ప్రతి గడపనూ పలకరిస్తూ దూసుకుపోతున్నారు. కాస్త గాయం కారణంగా పాదయాత్రకు బ్రేక్ పడింది కానీ..లేకుంటే పాలాభిషేకాలు…పూలాభిషేకాలతో ప్రచారం హోరెత్తేదే . ఆయన చేయని పాదయాత్ర లోటును..బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీర్చబోతున్నారనుకోండి. అక్టోబర్ 2న బండిసంజయ్‌ పాదయాత్ర సందర్భంగా భారీ సభనే ప్లాన్ చేసినా…వెయ్యికి మించి ఉండకూడదన్న నిబంధనతో అందుకు తగ్గట్లుగా సభా ఏర్పాట్లు చేసుకుంటోంది కాషాయ దళం.

Read also: అరకు ఘాట్ రోడ్ లో ఏరులై పారుతోన్న వరదనీరు.. విశాఖ ఏజెన్సీలో విరిగిపడుతున్న కొండచరియలు